Tollywood: రీమేక్‌లు అవసరమా.. ఓటీటీలు వచ్చాక కూడా

ABN, Publish Date - Nov 12 , 2024 | 08:23 AM

ప్లీజ్ మాకు రీమేకులు వద్దు ఓటీటీలంటే కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్న కమ్యూనికేషన్ మీడియం కాదు. మాకు అందుబాటులోనే ఉన్నాయి. మేము అన్ని సినిమాలు చుస్తునాం. ఇక రీమేకులు ఆపేయండి అంటున్నారు సగటు తెలుగు సినీ ప్రేమికులు.

ఈ ఏడాది మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ఆవేశం’ (Avesam) సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు వైవిధ్య నటుడు ఫహద్‌ ఫాజిల్‌. జీతూ మాధవన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ఓటీటీలోనూ దేశవ్యాప్తంగా సత్తా చాటింది. అయితే ఈ సినిమాని తెలుగులో బాలయ్యతో రీమేక్ చేస్తున్నారని మొదట టాక్ వచ్చింది. మాస్‌ మహారాజా రవితేజ (Raviteja) ఈ సినిమా రీమేక్‌ హక్కులు తీసుకున్నారని తాజా సమాచారం. అయితే ఈ విషయంపై తెలుగు సినిమా అభిమానులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓటీటీల రాజ్యంలో రీమేకులు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.


రీమేక్ సినిమాల ప్రధాన ఉద్దేశం.. ఆల్రెడీ హిట్ అయినా సినిమాని మళ్ళీతీసి ఈజీ మనీ సంపాదించుకోవడం. ఓటీటీలు వచ్చాక అందరు అన్ని భాషల చిత్రాలని చూసేస్తున్నారు. సో, ఒరిజినల్ వెర్షన్ ఒకసారి చూశాక రీమేక్ నచ్చడం చాలా కష్టం. ఆ రీమేక్‌లను కూడా సరిగ్గా తీయలేక ట్రోల్ మెటీరియల్ గానే మిగిలిపోతున్నాయి చాలా సినిమాలు. అయ్య‌ప్ప‌నుం కోషియుం, లూసీఫ‌ర్ తెలుగులో చిత్రీకరించిన తీరు చూస్తే కాస్త ఏడుపే వస్తుంది సగటు తెలుగు సినిమా అభిమానికి. అలాంటిది ‘ఆవేశం’ సినిమా రీమేక్ మెటీరియల్ కూడా కాదు. ఎందుకంటే


‘ఆవేశం’ 'ప్రేమలు', 'హృద‌యం' ఈ సినిమాలు పక్క మలయాళం రూటెడ్ ఉన్న సినిమాలు. మలయాళం యూత్ కెరీర్ కోసం చేసే వలసలు, వారి కల్చర్ ని చూపెట్టాయి. మరి మన కల్చర్ కేరళ కల్చర్ ఒకటేనా? వాస్తవం చెప్పాలంటే రీమేక్ సినిమాలు తెలుగు సినిమా స్థాయిని ఏమాత్రం పెంచలేకపోయాయి. తెలుగు కల్చర్, రూట్స్ ని సరిగ్గా చూపించిన 'బలగం', 'కమీటీ కుర్రాళ్లు' లాంటి సినిమాలకే తెలుగు ఆడియెన్స్ ఓటు వేస్తున్నారు. ప్లీజ్ మాకు రీమేకులు వద్దు ఓటీటీలంటే కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్న కమ్యూనికేషన్ మీడియం కాదు. మాకు అందుబాటులోనే ఉన్నాయి. మేము అన్ని సినిమాలు చుస్తునాం. ఇక రీమేకులు ఆపేయండి అంటున్నారు సగటు తెలుగు సినీ ప్రేమికులు.

Also Read-Tollywood Stars: అందరు స్టార్స్ మాల్దీవుల్లోనే.. ఎం జరుగుతుందంటే

Also Read-Allu Arjun Fans: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్‌పై ఫ్యాన్స్ దాడి.. పుష్ప 2

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2024 | 08:23 AM