Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతోన్న సినీ ప్రముఖులు
ABN, Publish Date - Dec 14 , 2024 | 10:38 AM
జైలు నుండి శనివారం ఉదయం విడుదలైన అల్లు అర్జున్‌కు సంఘీభావం తెలిపేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. వారెవరెవరంటే..
జైలు నుండి మధ్యంత బెయిల్‌తో విడుదలైన అల్లు అర్జున్‌కు సంఘీభావం తెలిపేందుకు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకున్నారు. హీరోలు, దర్శకనిర్మాతలతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర సందడి వాతావారణం నెలకొంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ ఇంటికి ఎవరెవరు వచ్చారంటే..
Also Read-Allu Arjun Released: అల్లు అర్జున్ విడుదల.. వెంటనే ఇంటికి వెళ్లలేదు
చిరంజీవి సతీమణి సురేఖ, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, కె. రాఘవేంద్రరావు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ సోదరులు, ఆర్. నారాయణమూర్తి, దర్శకుడు సుకుమార్, హరీష్ శంకర్, బివిఎస్ రవి, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ మరియు రవిశంకర్, కొరటాల శివ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి, వంటి వారంతా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. తనకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన సినీ ప్రముఖులను అల్లు అర్జున్ కూర్చోబెట్టి కాసేపు ముచ్చటించారు. ఇంకా సినీ ప్రముఖులు బన్నీ ఇంటికి క్యూ కడుతూనే ఉన్నారు.
శుక్రవారం బన్నీ అరెస్ట్ అయిన సమయంలో కూడా సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి రాగా, మెగా బ్రదర్ నాగబాబు ఇంకా పలువురు సెలబ్రిటీలు బన్నీ ఇంటికి చేరుకున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు బన్నీ అరెస్ట్‌పై రియాక్ట్ అయ్యారు. నాని, రష్మిక మందన్నా, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ వంటి వారంతా బన్నీ అరెస్ట్‌ను ఖండిస్తూ ట్వీట్స్ చేశారు. మొత్తంగా అయితే బన్నీకి టాలీవుడ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది.. లభిస్తోంది.