Prisha Singh: ప్రిషా సింగ్.. క‌థ మాములుగా లేదుగా! మ‌రి ఈ రేంజ్‌లోనా

ABN, Publish Date - Oct 02 , 2024 | 07:20 AM

ఈ కోవ‌లో ఇటీవ‌ల టాలీవుడ్‌లో త‌న టాలెంట్ చూయించ‌డానికి ఓ ఉత్త‌రాది భామ ప్రిషా సింగ్ రంగ ప్ర‌వేశం చేసి కుర్ర‌కారుకు హార్ట్‌త్రోబ్‌గా మారుతోంది. చేసింది రెండు సినిమాలే అయినా ప‌బ్లిక్ లైఫ్‌లో మాత్రం త‌న హాట్‌నెస్‌తో యువ‌త‌కు నిద్ర‌కు దూరం చేస్తోంది.

Prisha Singh

క‌న్న‌డ క‌స్తూరిలు, మ‌ల‌యాళ కుట్టీల దండ‌యాత్ర‌తో మ‌న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి ముంబ‌య్ హీరోయిన్ల దిగుమ‌తి కాస్త త‌గ్గింది. గ‌డిచిన ఐదేండ్ల క్రితం వ‌ర‌కు ఢిల్లీ, పంజాబ్‌, ముంబ‌య్‌ల నుంచి ప‌దుల సంఖ్య‌లో ముద్దుగుమ్మ‌లు తెలుగు సినిమాల్లో న‌టించి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోగా క‌లిసొచ్చిన వాళ్లు వ‌రుస ఛాన్సులతో విజ‌యాలు ద‌క్కించుకుని బాలీవుడ్‌కు వెళ్లి సెటిల్ అయ్యారు. క‌లిసిరాని వాళ్లు వేరే ఇండ‌స్ట్రీల‌కు త‌ర‌లిపోయారు.

ఈ కోవ‌లో ఇటీవ‌ల టాలీవుడ్‌లో త‌న టాలెంట్ చూయించ‌డానికి ఓ ఉత్త‌రాది భామ ప్రిషా సింగ్ (Prisha Rajesh Singh) రంగ ప్ర‌వేశం చేసి కుర్ర‌కారుకు హార్ట్‌త్రోబ్‌గా మారుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు చేసింది రెండు తెలుగు సినిమాలు అందులోనూ నిడివి త‌క్కువ పాత్ర‌లే అయినా త‌న క్యూట్‌నెస్‌తో అల‌రించింది. కానీ ప‌బ్లిక్ లైఫ్‌లో మాత్రం త‌న హాట్‌నెస్‌తో యువ‌త‌కు నిద్ర‌కు దూరం చేస్తోంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఈ బ్యూటీ 2020 క‌రోనా స‌మ‌యంలో ఓటీటీలో విడుద‌లైన బాలీవుడ్ చిత్రం గులాబో సితాబో చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై 2023లో తెలుగులో ఆరంగేట్రం చేస్తూ నిఖిల్ స్పై సినిమా చేసింది.

తాజాగా ఈ సంవ‌త్స‌రం అల్లు శిరీష్ బ‌డ్డీ చిత్రంలో రెండో హీరోయిన్‌గా చేసింది. అయితే మొత్తంగా ఈ అమ్మ‌డు చేసింది మూడు సినిమాలు వాటిల్లోనూ చిన్న పాత్ర‌లే కావ‌డంతో అవ‌కాశాలు అంత‌గా త‌లుపు త‌ట్ట‌డం లేదు.


కొత్త‌గా సినిమాల్లోకి వ‌చ్చిన‌ ఈ ముద్దుగుమ్మ‌ను చూస్తుంటే అమాయ‌కంగా ఉంది, ప‌ద్ద‌తిగా ఉంది ఛాన్సులు రావ‌డానికి కాస్త స‌మ‌యం ప‌డుతుంద‌ని అంతా అనుకుంటుంటే వాళ్లంద‌రికి మ‌తులు పొగొట్టేలా ఈ అమ్మ‌డి వ్య‌వ‌హారం ఉంది.

జ‌నం స్ట‌న్ అయ్యేలా అమ్మ‌డు మాంచి జోరులోనే ఉంటుంది. స‌మ‌యం దొరికితే విదేశీయానాలు చేస్తూ సేద తీరుతూ వీలైనంత వ‌ర‌కు చాలా పొదుపుగా దుస్తులు ధ‌రిస్తూ చూసే వారిలో వేడి పెంచుతోంది.

ఇక ఖాళీ స‌మ‌యాల్లో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఫొటోషూట్లు చేస్తూ త‌న అందాల‌న్నింటినీ అంత‌కుమించి అనేలా వ‌డ్డి వారుస్తోంది. వాటిని చూసిన వారంతా ఈ అమ్మ‌డు ఇప్పుడే ఇన్ని ర‌కాలుగా హోయ‌లు పోతుంటే మున్ముందు ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందోన‌ని అనుకుంటున్నారు.

ముఖ్యంగా ఇటీవ‌ల గ్లామ‌ర్ డోస్ భారీగా పెంచిన ఈ భోజ్‌ఫురి సుంద‌రికి సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతూ ఉంది. త్వ‌ర‌లోనే తెలుగు సినిమాల్లో మంచి అవ‌కాశాలే ద‌క్కించుకునేలా క‌నిపిస్తోంది.

Updated Date - Oct 02 , 2024 | 08:54 AM