Pushpa 2: సంధ్య థియేటర్ ఘటనలో ముగ్గురు అరెస్ట్
ABN, Publish Date - Dec 08 , 2024 | 08:56 PM
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప -2' (Pushpa 2) సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది.
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప -2' (Pushpa 2) సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సంధ్య థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను(Manager Arrest) అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను (Pushpa benefit show) కూడా అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్‌కు పంపించారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. మధ్య మండల డీసీపీ అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి 9.40 గంటల సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేశారని.. దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని తెలిపారు. ప్రేక్షకులతోపాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారన్న సమాచారం తమకు లేదని తెలిపారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా తమకు ఆ సమాచారం చెప్పలేదని పేర్కొన్నారు. దీనికోసం థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని తెలిపారు. పబ్లిక్‌ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేయలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్‌లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని తెలిపారు.