Dhoom Dham:ధూం ధాం నుంచి థర్డ్ సింగిల్.. 'టమాటో బుగ్గల పిల్ల..' లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 24 , 2024 | 05:32 PM

చేతన్ కృష్ణ , హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'మల్లెపూల టాక్సీ', 'మాయా సుందరి' పాటలు ఛాట్ బస్టర్స్ అవ‌గా తాజాగా.. థర్డ్ సింగిల్ 'టమాటో బుగ్గల పిల్ల..' లిరికల్ సాంగ్ విడుదల చేశారు.

Dhoom Dham

చేతన్ కృష్ణ (Chetan Krishna), హెబ్బా పటేల్ (Hebah) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం (Dhoom Dham). సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ (Ramkuma rMaddineni) నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా (Macha Saikishor) రూపొందిస్తున్నారు. గోపీ మోహన్ (Gopimohan) స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'మల్లెపూల టాక్సీ', 'మాయా సుందరి' పాటలు ఛాట్ బస్టర్స్ అవ‌గా తాజాగా.. థర్డ్ సింగిల్ 'టమాటో బుగ్గల పిల్ల..' లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి (Ramjogaiah Sastry) లిరిక్స్ అందించగా, గోపీ సుందర్ (Gopi Sundar) బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. శ్రీకృష్ణ (Sri Krishna), గీతా మాధురి (Geeta Madhuri) ఆకట్టుకునేలా పాడారు.


'ఎట్టెట్టగున్నా నువ్వు భల్లేగుంటావే.. ఏ మాయో చేసి నన్ను గిల్లేస్తుంటావే..బంగారం గానీ తిన్నావా నువ్వు బబ్లీగా ముద్దొస్తుంటావే.. బంగాళాఖాతం చెల్లెల్లా నన్ను అందంతో ముంచెస్తుంటావే.. టమాటో బుగ్గల పిల్ల..' అంటూ సాగుతుందీ పాట. కలర్ ఫుల్ డ్యూయెట్ గా 'టమాటో బుగ్గల పిల్ల..(Tomato Buggala Pilla) పాటను రూపొందించారు.

Updated Date - Jul 24 , 2024 | 05:33 PM