Celebrity Lifestyle: కావ్య థాపర్.. 'ఈ మాయ పేరేమిటో'
ABN, Publish Date - Oct 30 , 2024 | 05:08 PM
'ఈ మాయ పేరేమిటో' అంటూ తొలి సినిమాతోనే యూత్ ని తన మాయలో పడేసింది కావ్య థాపర్. తర్వాత వరుసగా 'ఏక్ మినీ కథ', 'బిచ్చగాడు 2', 'ఈగల్', 'ఊరు పేరు భైరవకోన', 'డబుల్ ఇస్మార్ట్', 'విశ్వం' సినిమాలతో పాపులారిటీ సంపాదించుకుంది ఈ పంజాబీ బ్యూటీ. అసలు తెలుగు సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీ ఆక్సిడెంటల్ గా హీరోయిన్ ఎలా అయ్యింది? తన క్రష్ ఎవరు? ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్‌ని పూర్తిగా చదివేయండి.
సడెన్ సెలబ్రిటీ
కావ్య.. తొమ్మిదో తరగతిలో ఉన్నపుడు వాళ్ళ అన్నయ్యతో కలిసి స్కూల్ కి వెళ్తుంటే రోడ్ పై జనాలు గుమిగూడటం చూసి ఆగిందట. అక్కడ ' కేవలం ఫోటో దిగితే చాలు.. రెండు వేలు ఇస్తాం' అని చెప్పారట. దీంతో కావ్య.. సరదాకి స్టిల్స్ ఇచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ తన ఫ్రెండ్ కాల్ చేసి పేపర్లో నీ ఫోటో పడింది అని చెప్పేసరికి షాక్ అయ్యిందట. నెక్స్ట్ పెద్ద పడ్డ నగరాల్లో తన హోర్డింగ్స్ కనపడేసరికి ఏడ్చేసిందట. ఇలా ఒకే రోజులో ఆమె సడెన్ సెలబ్రిటీ అయ్యారు. సాధారణంగా సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెబుతారు. కానీ కావ్య విషయంలో మాత్రం పూర్తి భిన్నం. తనని నటిగా చూడాలన్నది వాళ్ళ నాన్న కల. అందుకే గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే నటనపై దృష్టి పెట్టిందట. ఈ క్రమంలోనే పతంజలి, మేక్ మై ట్రిప్.. ప్రకటనల్లో నటించే అవకాశం దక్కాయి. ప్రకటనల్లో చూసే 'ఈ మాయ పేరేమిటో' సినిమాకు ఎంపిక చేశారు. అలా తెలుగు సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
చెర్రీ ఫేవరెట్.. క్రష్ మాత్రం తారక్
'రంగస్థలం' సినిమా చూసి రామ్ చరణ్ కి పెద్ద ఫ్యాన్ అయిపోయింది కావ్య. అందులో చరణ్ యాక్టింగ్ అంటే పిచ్చి అని చెప్పింది. చరణ్ పక్కన నటించడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అంది. ఇక సెలబ్రిటీ క్రష్ విషయానికొస్తే.. తనదైన యాక్టింగ్, డాన్సులతో అందరి మతి పోగొట్టే జూనియర్ ఎన్టీయార్ అని చెప్పేసింది. అలాగే టాలీవుడ్లో ప్రతి హీరోకి ఒక స్పెషాలిటీ ఉంటుందని చెప్పుకొచ్చింది.
క్యాస్టింగ్ కౌచ్
కెరీర్ తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకుందట ఈ బ్యూటీ. ఒక యాడ్ అఫర్ కోసం ఆఫీస్ కి వెళ్తే.. నాలుగు ఆఫర్లు ఇస్తా కమిట్మెంట్ ఇస్తారా అని అడిగారట. దీంతో మొహం మీదే నో చెప్పేసి.. ఇలాంటి నాకు ఇష్టం ఉండదని బయటికి వచ్చేశారట.
నాన్‌వెజ్‌కి 'నో'
కావ్యకి కాస్త ఆధ్యాత్మిక చింతన ఎక్కువే.. రోజు గురూజీల ప్రవచనాలు వినడం అలవాటు. ఆ ప్రభావంతోనే నాన్ వెజ్ మానేశారట. "మనం తినేందుకు ఆ దేవుడు ఎన్నో ఇచ్చాడు. అలాంటప్పుడు ఒక ప్రాణిని చంపడం ఎందుకు? పౌల్ట్రీపారాల్లో జంతువుల ఉత్పత్తి కోసం రకరకాల ఇంజెక్షన్లు ఇచ్చి అమానవీయంగా ప్రవర్తించడాన్ని యూట్యూబ్ లో చూసి షాక్ అయ్యాను" అంటూ చెప్పుకొచ్చారు కావ్య. దీంతో ఆవేదనకు గురై ఇక నాన్ వెజ్ ముట్టొద్దని ఫిక్స్ అయ్యిందట. ఫిట్ నెస్ లో కఠిన నియమాలు పాటించే కావ్య పొద్దునే అలోవెరా, గీటోయ్ జ్యూస్ తాగుతారట. వెజిటేరియన్ కావడంతో కేవలం కాయగూరలు, ఆకుకూరలు మాత్రమే తీసుకుంటా జంక్ జోలికి అసలు వెళ్ళాదట. ఎటువంటి పరిస్థితులలోనైనా కనీసం 30 నిమిషాల వ్యాయామం తప్పనిసరి అంటుంది ఈ పంజాబీ బ్యూటీ.