Posani Krishna Murali: వర్మ, మాకేంటి ఈ కర్మ.. అర్థమైందా రాజా
ABN, Publish Date - Nov 22 , 2024 | 12:25 PM
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిల ప్రవర్తన తీరు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ వీరిపై ఎలా రియాక్ట్ అవుతుందంటే..
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నటుడు,రచయిత పోసాని కృష్ణ మురళి మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. తమ అసాధారణ ప్రతిభతో ఇండస్ట్రీలో స్వశక్తితో ఇండస్ట్రీ గౌరవించేల ఎదిగారు. కానీ, వారి జీవితాలకి రాజకీయాలు ఎప్పుడైతే పులుముకున్నాయో అప్పటినుండి వారు నీచంగా దిగజారిపోయారు. ఒక్కప్పుడు ఓ రాజకీయ పార్టీ అండదండలు చూసుకొని అడ్డు అదుపు లేకుండా విర్రవీగిన వీళ్ళు.. ప్రస్తుతం ఏపీలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా భయంతో వణికిపోతూ క్షమాపణలు చెబుతున్నారు.
ప్రస్తుతం ఏపీలో.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ లతో చెత్తను వాగే వారికి చమటలు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో వీరిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి నన్ను క్షమించండంటూ వేడుకున్నారు. ఇక రాజకీయాలకి గుడ్ బై చెబుతున్న అని ప్రకటించారు. ఒకప్పుడు బాబు, పవన్, లోకేష్ ల మీద బరితెగించి నోరేసుకుపడ్డ వీరంతా ఇప్పుడు బేంబెలెత్తిపోతున్నారు. పిల్లలు, మహిళలు అనే కనీస స్పృహ, సంస్కారం కూడా లేకుండా పవన్ కల్యాణ్ కుటుంబం మీద జుగుప్త్సాకరంగా విమర్శలు చేశారు. ఒక సామాజిక వర్గంపై విషం చిమ్మడమే టార్గెట్ అన్నట్లు మాట్లాడారు. అలాంటి పోసాని ఇప్పుడు.. ఎక్కడలేని వినమ్రతతో దండాలు పెడుతూ, తాను రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నానంటూ, తన ఆఖరి శ్వాస వరకు కుటుంబం కోసమే జీవిస్తానంటూ కాళ్లబేరానికి వచ్చేశారు.
ఇక మోస్ట్ డేరింగ్ డైరెక్టర్ అనుకునే రామ్ గోపాల్ వర్మకి చమటలు పడుతున్నాయి. తన స్థాయిని దిగజార్చుకుని.. ప్రజా నాయకులపై కనీస సృహ లేకుండా చేతికి వచ్చిన పోస్టులు పెట్టుకుంటూ, నోటికి వచ్చిన వాగుడు వాగుతూ, మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేస్తూ.. తనని ఎవరు టచ్ చేయలేరనే అహంకారాన్ని ప్రదర్శిస్తూ.. ఎంతోమంది మనోభావాలు దెబ్బ తీస్తూ, లక్షలాది మంది ప్రజల మానసిక క్షోభకు కారణమయ్యారు. అప్పుడు కన్ను మిన్ను కానరాకుండా రెచ్చిపోయిన వర్మ కు .. ఇప్పుడు మాత్రం నోటీసు పేరు ఎత్తితేనే వణుకొస్తోంది. విచారణకు హాజరు కావడానికి కూడా భయపడుతూ.. రకరకాల కారణాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదంతా గమనిస్తున్న సినీ రాజకీయ వర్గాల్లో నిజంగా వీరు భయపడుతున్నారా లేదా భయం నటిస్తున్నారా అనే చర్చ నడుస్తొంది. పరిధి దాటి వ్యక్తిగత విమర్శలు, తప్పులు చేసిన వీరు, ఇప్పుడు భయపడుతుంటే.. క్షమించమని వేడుకుంటే.. ఎందుకో ఎవరికి జాలీ కూడా కలగటం లేదు. గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలని సామెతకు తగ్గట్టుగా రాజకీయాలు చేయాలనుకుంటే పాలిటిక్స్ లోకి వెళ్లాలి కానీ.. సినిమా పరిశ్రమలో ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని ఒకవేళ తమకున్న భావప్రకటన స్వేచ్చతో మాట్లాడినా.. పరిధి దాటకూడదని.. దాటితే దాని పర్యవసానాలు కూడా తీవ్రంగా ఉంటాయనే విషయం పోసాని, వర్మల విషయంలో క్లారిటీగా కనిపిస్తొందనే చర్చ నడుస్తొంది. గత ఐదేళ్లలో వీరిని ఆదర్శంగా తీసుకుని మరికొంతమంది ఉన్మాదులు సోషల్ మీడియా లో విష ప్రచారాలు చేశారు. అలాంటి సైకోలకు ఎలాంటి శిక్షలు విధిస్తారో.. ఈ సెలబ్రిటీ సైకోలకు సైతం వారు చేసిన ఓవర్ యాక్షన్ కు తగ్గ రియాక్షన్ ఎలా ఉంటుందో చూపించాలని.. నెటిజెన్స్ నుంచి ఖచ్చితమైన రెస్పాన్స్ వస్తుంటే.. భవిష్యత్తులో మరలా ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా.. సినీ పరిశ్రమ పరువు బజారున పడకుండా ఉండాలంటే పోసాని ,వర్మలకు తగిన శాస్తి జరగాలనే వాదన సినీ పరిశ్రమలోనూ బలంగా వినిపిస్తోంది.