Monal Gajjar: బిగ్‌బాస్ మోనాల్.. చేస్తోంది బేజార్‌

ABN, Publish Date - Oct 18 , 2024 | 11:15 PM

బిగ్‌బాస్ బ్యూటీ, టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ త‌న టాలెంట్‌ను, భ‌క్తిని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించింది. చూపించింది. ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో నిర్వ‌హించిన న‌వ‌రాత్రి వేడుక‌ల్లో పాల్గొని ఆట‌పాట‌లతో అల‌రించింది.

బిగ్‌బాస్ (Bigg Boss 4) బ్యూటీ, టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ (Monal Gajjar) త‌న టాలెంట్‌ను, భ‌క్తిని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించింది. చూపించింది.

ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో భాగంగా త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో నిర్వ‌హించిన న‌వ‌రాత్రి వేడుక‌ల్లో పాల్గొని ఆట‌పాట‌లతో అల‌రించింది.

సాంప్ర‌దాయ దుస్తులు ధ‌రించి న‌వ‌రాత్రులు భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో పూజ‌లు, గాబ్రా డ్యాన్సుల‌తో ఉత్స‌వాల‌ను క‌ల‌ర్‌ఫుల్‌ చేసింది.

ఇందుకు సంబ‌ధించిన ఫొటోల‌ను ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా బాగా వైర‌ల్ అవుతున్నాయి.

ఇదిలాఉండ‌గా బిగ్‌బాస్ (Bigg Boss 4) నుంచి వ‌చ్చాక‌ మోనాల్‌కు ఎంతో పేరు వ‌చ్చిన‌ప్ప‌టికీ తెలుగు నుంచి సినిమా అవ‌కాశాలు అంత‌గా త‌లుపుత‌ట్ట‌లేదు. కానీ గుజ‌రాత్‌లో వ‌రుస ఛాన్సులతో దూసుకెళుతుంది.

తెలుగులో చివ‌ర‌గా బెల్లంకొండ శ్రీనావాస్‌ అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ ప్ర‌త్యేక పాట‌లో క‌నిపించిన మోనాల్ త‌ర్వాత ఏ తెలుగు సినిమాలోనూ న‌టించ‌లేదు. కొన్ని టీవీ షోలు మాత్రం చేసింది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది.

Updated Date - Oct 18 , 2024 | 11:26 PM