Mohan Babu: మోహన్ బాబుకి షాకిచ్చిన హైకోర్టు

ABN, Publish Date - Dec 19 , 2024 | 04:06 PM

తెలంగాణ హైకోర్టు మోహన్ బాబుకి పెద్ద షాకిచ్చింది

మోహన్ బాబుకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. హత్యాయత్నం కేసులో సోమవారం వరకు అరెస్ట్ చెయ్యొద్దని కోరుతూ బెయిల్ పిటిషన్ కోరారు మోహన్ బాబు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు. మోహన్ బాబు ఇక్కడే ఉన్నారనే విషయాన్ని అఫడవిట్ లో దాఖలు చేయాలని కోరింది. అప్పుడే ఏదైనా తేల్చుతాం అని తెలిపిన కోర్టు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.


మరోవైపు జల్‌పల్లిలో తన నివాసం వద్ద జరిగిన ఘటనపై మోహన్‌బాబు మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా జర్నలిస్ట్‌ని కొట్టలేదని చెప్పారు. అనుకోకుండా జరిగిన పొరపాటు అంటే జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. గతవారం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లి.. చికిత్స పొందుతున్న జర్నలిస్టును మోహన్‌బాబు, మంచు విష్ణు పరామర్శించారు. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పారు.


ఇప్పటీకే నటుడు మోహన్‌బాబు తన లైసెన్స్‌డ్‌ గన్‌ను సరెండర్ చేశారు. తన పీఆర్వో ద్వారా డబుల్‌ బ్యారెల్‌ గన్‌ను చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. కొన్ని రోజులుగా మంచు మోహన్‌ బాబు కుటుంబంలో జరుగుతున్న వివాదాల గురించి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోహన్‌ బాబు, కుమారుడు మనోజ్‌ ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారి తుపాకుల్ని సరెండర్‌ చేయమని పోలీసులు ఆదేశించారు.

Updated Date - Dec 19 , 2024 | 04:19 PM