మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tarak Ponnappa: ఆ పరిజ్ఞానం చూసి ఆశ్చర్యపోయా 

ABN, Publish Date - Apr 23 , 2024 | 12:22 PM

ఐకాన్ స్టార్  అల్లు అర్జున్(Allu arjun) పై కన్నడ నటుడు తారక్‌ పొన్నప్ప (Tarak ponnappa) ప్రశంసలు కురిపించారు. ‘కేజీఎఫ్‌’తో (KGF)గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ

Allu arjun -Taarak Ponnappa

ఐకాన్ స్టార్  అల్లు అర్జున్(Allu arjun) పై కన్నడ నటుడు తారక్‌ పొన్నప్ప (Tarak ponnappa) ప్రశంసలు కురిపించారు. ‘కేజీఎఫ్‌’తో (KGF)గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘పుష్ప2’లో (Pushpa 2) కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. బన్నీతో కలిసి నటించిన అనుభవాన్ని ఈ సందర్భంగా షేర్‌ చేసుకున్నారు.

‘‘పుష్ప ది రూల్‌’లో (Pushpa: The rule) నాకు Allu arjunతో యాక్షన్‌ సన్నివేశాలున్నాయి. గతంలో స్టంట్స్‌ చేసిన అనుభవం నాకు లేదు. ఫైట్‌ సీక్వెన్స్‌ చేసేటప్పుడు ఆయన ఎన్నో కొత్త విషయాలను చెప్పారు. స్క్రీన్క పై నిపించే విధానంలో పలు సలహాలు ఇచ్చారు. బాడీ పొజిషన్స్‌ గురించి చెప్పారు. ఆయనకు డ్యాన్స్‌, స్టంట్స్‌పై ఉన్న అద్భుతమైన పరిజ్ఞానం చూసి ఆశ్చర్యపోయాను. ఆయన గొప్ప నటుడు’’ అని కితాబిచ్చారు.

Double iSmart: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆగిపోయిందా? ఎంతవరకు నిజం?




‘పుష్ప: ది రైజ్‌’కి పాన ఇండియా స్థాయి సూపర్‌హిట్‌ కావడంతో దానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న  ‘పుష్ప: ది రూల్‌’పై మరింత దృష్టి పెట్టారు సుకుమార్‌ టీమ్‌. మొదటి భాగాన్ని మించి ఈ చిత్రం ఉండాలని ఆహర్నిశలు కష్టపడుతున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, అనసూయ, సునీల్‌ కీలక పాత్రధారులు. ఆగస్ట్‌ 15న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

Read More: Tollywood, Cinema News

Updated Date - Apr 23 , 2024 | 12:34 PM