మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Swathi Reddy: ఛీ.. నీ బతుకు కామెంట్‌కు.. స్వాతి కౌంటర్‌!

ABN, Publish Date - May 09 , 2024 | 04:29 PM

కలర్స్‌ స్వాతి (Swathi Reddy) గురించి పరిచయం అక్కర్లేదు. టీవీ యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె హీరోయినగా కూడా మంచి చిత్రాలే చేసింది. '

కలర్స్‌ స్వాతి (Swathi Reddy) గురించి పరిచయం అక్కర్లేదు. టీవీ యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె హీరోయినగా కూడా మంచి చిత్రాలే చేసింది. 'డేంజర్‌’, 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చక్కని పాత్రలు పోషించింది. 'అష్టా చమ్మా' సినిమాతో హీరోయిన్ గా  మారింది. ప్రస్తుతం కాస్త స్పీడు తగ్గింది. గతేడాది 'మంత్‌ ఆఫ్‌ మధు’ సినిమాతో పలకరించింది. అయితే ఈమె సోషల్‌ మీడియాలో అంత యాక్టివ్‌ కాదు. అప్పుడప్పుడు తన సినిమాల గురించి మాత్రమే పోస్ట్‌లు చేస్తుంటారు.

తాజాగా ఆమె తన కుటుంబసభ్యులను పరిచయం చేస్తూ ఓ వీడియోను ఇన్‌స్ట్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఇది చూసిన ఓ ఆకతాయి నెటిజన్‌.. 'ఛీ నీ బతుకు..' అని కామెంట్‌ చేశాడు. దానికి కౌంటర్‌ ఇచ్చింది స్వాతి. ఆ నెటిజన్ కామెంట్‌ను  స్క్రీన్  షాట్ షేర్‌ చేసి 'కొన్నిసార్లు నాక్కూడా అలాగే అనిపిస్తుంది’ అని సెటైర్‌ వేసింది. కానీ అప్పుడే మళ్లీ ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుంటాను.. థాంక్యూ నా బుజ్జి బతుకు.. ఈ బతుక్కి దిష్టి తగలకూడదన్నట్లుగా నో దిష్టి అనే సింబల్‌ను జత చేసింది. ప్రస్తుతం స్వాతి కామెంట్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.



అయితే స్వాతి తన భర్తకు విడాకులు ఇవ్వబోతుందని చాలాకాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల ఓ వేదికపై ఇదే ప్రశ్న అడగగా, వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదని ఘాటుగా సమాధానమిచ్చింది. 

Updated Date - May 09 , 2024 | 04:29 PM