మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kalki 2898 AD: నిర్మాత స్వప్నాదత్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ABN, Publish Date - Mar 23 , 2024 | 08:50 AM

ప్రభాస్‌(Prabhas) హీరోగా భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’(kalki 2898ad). నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.


ప్రభాస్‌(Prabhas) హీరోగా భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’(kalki 2898ad). నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ భైరవ అనే పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాపై నిర్మాత స్వప్నదత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ‘సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌’ వేదికపై నిర్మాత స్వప్నదత్  మాట్లాడారు. ప్రభాస్‌ పోషిస్తున్న భైరవ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందన్నారు. సినిమా ఓ ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుందని ఆమె చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నిర్మాత వ్యాఖ్యలపై ప్రభాస్‌ ఫ్యాన్స్  ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా కాన్సెప్ట్‌ గురించి ఓ వేదికపై దర్శకుడు వివరించారు. ‘‘మహా భారతంతో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఈ  కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి దానికి తగ్గటు ఆయా ప్రపంచాల్ని సృష్టించడానికి ప్రయత్నించాం. ఆ ప్రపంచాలు కూడా భారతీయతను ప్రతిబింబించేలా ఊహించుకుంటూ మలిచాం. హాలీవుడ్‌లో విడుదలైన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘బ్లేడ్‌ రన్నర్‌’ పోలికలు ఇందులో కనిపించనివ్వలేదు. అది మాకు పెద్ద సవాల్‌గా మారింది’’ అని అన్నారు. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Mar 23 , 2024 | 11:19 AM