Kanguva: సూర్యకి తీరని అన్యాయం.. హైదరాబాద్‌లో ఒక్కటే స్క్రీన్

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:58 AM

భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సూర్య 'కంగువ' సినిమాకి నైజాం ఏరియాలో తీవ్ర అన్యాయం జరిగింది. రెండు నిర్మాణ సంస్థలు మధ్య జరిగిన మైండ్ గేమ్స్‌కి సూర్య బలయ్యారు. ఇంతకీ ఎం జరిగిందంటే..

రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరెకెక్కిన సూర్య పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌ 'కంగువ'కి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర అన్యాయం జరిగింది. రెండు సంస్థలు ఆడిన మైండ్ గేమ్స్‌లో సూర్య బాలి అయ్యారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్స్ రైట్స్‌ని నైజాం ఏరియాలో 'మైత్రి డిస్ట్రిబ్యూటర్స్' సంస్థ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నైజాం ఏరియాలో మేజర్ థియేటర్స్ కలిగిన మరొక సంస్థ ఈ సినిమాకి థియేటర్స్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. చివరి క్షణం వరకు ఈ వివాదం సద్దుమణుగుతోంది అని అంత భావించారు. కానీ.. అలాంటిదేమి జరగలేదు. ఇక మల్టీ‌ప్లెక్స్‌ల్లో 'కంగువ'కి తీరని అన్యాయం జరిగింది. ఇంతకీ ఏమైందంటే..


'పుష్ప 2' సినిమా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఈ సంస్థ 'కంగువ' డిస్ట్రిబ్యూషన్స్ రైట్స్ ని సొంతం చేసుకుంది. కాగా, పుష్ప 2 రిలీజ్‌ని ఉద్దేశించి ఈ సంస్థ చేసిన కొన్ని పనులు ఏషియన్ సినిమాస్ సంస్థతో వివాదానికి కారణమయ్యాయి. దీంతో ఈ ఎఫెక్ట్ 'కంగువ' సినిమాపై పడింది. నైజాం ఏరియాలో 30% థియేటర్స్ కూడా ఈ సినిమాకి దక్కలేదు. ఏఎంబీ, ఏఏఏ స్క్రీన్స్ కూడా చివరి నిమిషంలో కేటాయించారు. హైదరాబాద్ లో కేవలం ఒకే ఒక్క పీవీఆర్ స్క్రీన్ 'కంగువ'కి కేటాయించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ చెప్పుకోవచ్చు.

Also Read-Kanguva X Review: సూర్య 'కంగువ' ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ


ఈ సినిమా రిలీజైన అన్ని చోట్లా నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫైట్స్, విజువల్స్ అదిరిపోయాయని ఫ్యాన్స్ ట్విటర్‌లో సందడి చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచిందంటున్నారు. మరికొందరు ఇది సూర్య కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు. సినిమాలో ఎన్నో ట్విస్ట్‌లు ఉన్నాయని టాక్.

Also Read-Matka: వరుణ్ తేజ్ హిట్ కొట్టాడా.. మట్కా 'ట్విట్టర్' రివ్యూ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 14 , 2024 | 12:20 PM