Vettaiyan: ర‌జ‌నీకాంత్‌ ’వెట్ట‌యాన్’ పై ట్రోలింగ్.. నిర్మాత‌ల ప్రెస్మీట్‌

ABN, Publish Date - Oct 09 , 2024 | 07:56 PM

కొన్ని గంట‌ల్లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ వెట్ట‌యాన్ సినిమా ప్ర‌పంచ‌మంతా రిలీజ్‌కు రెడీ అవుతున్న స‌మ‌యంలో మేక‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది.

vettayan

కొన్ని గంట‌ల్లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) వెట్ట‌యాన్ (Vettaiyan) సినిమా ప్ర‌పంచ‌మంతా రిలీజ్‌కు రెడీ అవుతున్న స‌మ‌యంలో మేక‌ర్స్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్‌కు కొత్త త‌ల‌నొప్పి వ‌చ్చి ప‌డింది. సినిమా టైలటిల్ తెలుగులో కాకుండా త‌మిళ పేరే కంటిన్యూ చేస్తున్న నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో పెద్ద దుమారం మొద‌లైంది. ఈక్ర‌మంలో ఈ వెట్ట‌యాన్ (Vettaiyan) సినిమాను ఏషియన్ సురేష్, దిల్ రాజు సంస్థలు.. తెలుగులో రిలీజ్ చేస్తున్న నేప‌థ్యంలో నిర్మాతలు సురేష్ బాబు (Suresh Babu), దిల్ రాజు (Dil Raju), రానా దగ్గుబాటి రామానాయుడు (Rana Daggubati) స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా సురేష్ బాబు (Suresh Babu) మాట్లాడుతూ.. తెలుగులో చాలా డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి, తెలుగు సినిమాలు కూడా చాలా లాంగ్వేజ్‌ల‌లో డబ్ అవుతున్నాయి ఇప్పుడంతా ఓన్ ఇండియా వన్ నేషన్ అంటున్నారు కదా తెలుగు వెట్టయాన్ ని అందరూ వచ్చి చూడాల‌ని కోరారు. అప్పుడెప్పుడో వచ్చిన టైటానిక్ సినిమాను అదే టైటిల్ తో ప్రపంచం అంతా చూసింది, అప్పుడు సినిమాలో పాట కూడా ఇంగ్లీష్ లోనే ఉంటే చూశారు. మ‌న బాహుబలి సినిమాను కూడా అంతా యాక్సెప్ట్ చేశారు. మనం‌ కూడా సినిమాలను అలానే చూడాలని.. కావాల‌ని ఇష్యూ చేయాలంటే అవుతుందని అన్నారు. చివ‌ర‌గా దగ్గుబాటి రానా (Rana Daggubati) మాట్లాడుతూ.. రజనీ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. డైరెక్టర్ మీద ఇష్టంతో ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ వర్క్ చేశారన్నారు. ఈ రోజు మన తెలుగు సినిమాని ప్రపంచం మొత్తం చూస్తుందని ట్రోల్స్ అనేవి టైం పాస్ అని అన్నారు.


అనంత‌రం దిల్ రాజు (Dil Raju) మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో..తెలుగులో వెట్టాయన్ (Vettaiyan) అనే టైటిల్‌ను కాంట్రవర్సీ చేస్తున్నారు. సినిమా గ్లోబల్ అయ్యింది సాధ్యమైనంత వరకు టైటిల్స్ లోకల్ పేరుతో పెడుతున్నారు లేని పక్షంలో ఆ టైటిల్ ని కంటిన్యూ చేస్తున్నారు.. సినిమాని సినిమాగా చూడండి అని అన్నారు. ఈ సినిమాకు తెలుగులో వేట‌గాడు అని పెట్టాల‌ని ప్ర‌య‌త్నించినా అందుబాటులోకి లేక అదే కంటిన్యూ చేశార‌న్నారు. పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు కొన్ని భాష‌లలో టైటిల్ విషయంలో స‌మ‌స్య‌లు ఉంటాయి, గేమ్ చేంజర్ విషయంలో కూడా రెండు మూడు లాంగ్వేజ్‌లలో ఇబ్బంది అయ్యిందన్నారు.

ఇదిలాఉండ‌గా తాజాగా.. ఈ ఇష్యూపై వెట్ట‌యాన్ నిర్మాణ సంస్థ LYCA ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌ స్పందించి ఓ లేఖ‌ను విడుద‌ల చేసింది. గ‌తంలో RRR, సీతా రామం వంటి ప్రపంచ స్థాయి తెలుగు చిత్రాలను పంపిణీ చేశాము, కొన్ని తెలుగు సినిమాల‌ను త‌మిళ‌నాట అందించాం. రీసెంట్‌గా మా సంస్థ నిర్మించిన వెట్ట‌యాన్ 10న ప్రేఓకుల ముందుకు వ‌స్తుంది. అయితే మొదట, మేము తెలుగు డబ్బింగ్ వెర్షన్ వెట్టయ్యన్‌కు అర్థం వ‌చ్చే వేటగాడు అనే టైటిల్‌ పెట్టాలని నిర్ణయించుకున్నాం కానీ ఆపేఉను తెలుగులో అప్ప‌టికే వేరే వాళ్లు రిజిస్టర్ చేయుంచుకోవ‌డంతో మాకు ఆ టైటిల్ ల‌భించ‌లేదు. దీంతో సినిమా విడుదలవుతున్న అన్ని డబ్బింగ్ వెర్షన్‌లకు వెట్ట‌యాన్ ది హంట‌ర్‌ అనే పేరునే ఉంచాల‌ని నిర్ణ‌యించాం. ద‌య‌చేసి తెలుగు ప్రేక్ష‌కులు, మీడియా స‌హృద‌యంతో మా ఈ విన్న‌పాన్ని అర్ధం చేసుకోవాల‌ని, సినిమాను చూసి విజ‌య‌వంతం చేయాల‌ని ఈ లేఖ‌లో పేర్కొన్నారు.

Updated Date - Oct 09 , 2024 | 07:57 PM