Supriya Yarlagadda: సుప్రియ ఏమన్నారంటే..
ABN, Publish Date - Oct 08 , 2024 | 05:46 PM
కేవలం పొలిటికల్ మైలేజి కోసమే ఆమె ఈ వ్యాఖ్యలను చేశారని నాగార్జున కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కోర్టు ఆయన వాదనలను రికార్డ్ చేసింది. అనంతరం కోర్టు సుప్రియని వాంగ్మూలం అడగగా ఏమన్నారంటే..
తెలంగాణ మంత్రి కొండా సురేఖ(Konda Surekha) నటుడు నాగార్జున(Nagarjuna) ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలపై ఆయన కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సోమవారం కేసును టేకాఫ్ చేసిన నాంపల్లి కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఫిర్యాదుదారుడు నాగార్జునతో పాటు సాక్షులు సుప్రియ(Supriya) యార్లగడ్డ, అట్ల వెంకటేశ్వర్లు వాంగ్మూలాలను కోరింది. మొదటగా నాగార్జున తన స్టేట్మెంట్ ఇస్తూ.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల ద్వారా తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు తెలియజేశారు. కేవలం పొలిటికల్ మైలేజి కోసమే ఆమె ఈ వ్యాఖ్యలను చేశారని ఆయన కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో కోర్టు ఆయన వాదనలను రికార్డ్ చేసింది. అనంతరం కోర్టు సుప్రియని వాంగ్మూలం అడగగా ఏమన్నారంటే..
‘‘కేటీఆర్ వల్ల నాగ చైతన్య, సమంత విడాకులు జరిగాయని అని మంత్రి మాట్లాడారు.. ఎన్ కన్వెన్షన్ విషయంలో సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించమంటే సమంత ఒప్పుకోలేదు. అందుకే విడాకులు తీసుకుందని మంత్రి మాట్లాడారు. దీంతో మా కుటుంబం మొత్తం షాక్‌నకు గురైంది. ఈ విధంగా మంత్రి మా కుటుంబంపై ఎందుకు మాట్లాడిందో అర్థం కాలేదు. దాంతో మా కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైంది. మంత్రి చేసిన వ్యాఖ్యలు నేను కొన్ని మీడియా చానెళ్లలో చూశా. నేషనల్ మీడియాలో కూడా ఈ వార్త విన్నాను. మరుసటి రోజు పేపర్లో కూడా వార్త వచ్చింది. దీని వల్ల మా కుటుంబం తీవ్రమైనోవేదనకు గురైంది’’ అంటూ సుప్రియ వాంగ్మూలం ఇచ్చారు. విచారణ ముగిసిన అనంతరం నాగార్జున కుటుంబం కోర్టు నుంచి వెళ్లిపోయింది. కేవలం సుప్రియ స్టేట్‌మెంట్‌ను మాత్రమే న్యాయస్థానం రికార్డ్ చేసింది. 10వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది. ఆ రోజు మరో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తారు.