SDGM: సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని మొద‌లుపెట్టారు

ABN, Publish Date - Jun 23 , 2024 | 09:46 PM

గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ యాక్ష‌న్ హీరో స‌న్నీడియోల్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈరోజు (ఆదివారం) అఫీషియల్ గా సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

sdgm

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) సంయుక్తంగా టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేని (Gopichandh Malineni) ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ యాక్ష‌న్ హీరో స‌న్నీడియోల్ (Sunny Deol) హీరోగా ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. సినిమా ప్ర‌క‌ట‌న‌తోనే దేశ‌వ్యాప్తంగా వార్త‌ల్లో నిలిచిన ఈ చిత్రం ఈరోజు (ఆదివారం) అఫీషియల్ గా సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది.


కంట్రీస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న #SDGM ఇండియన్ సినిమాలో.. మూవీ నెరేటివ్ లో కీలకంగా ఉండే కొన్ని సన్నివేశాలను షూట్ చేసి మూవీ యూనిట్ మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించింది. లార్జర్ దెన్ లైఫ్ గా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు మొదటి నుంచి చివరి వరకు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ అందించనున్నాయి.

థమన్ ఎస్ (thaman) ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండ‌గా.. సయామి ఖేర్, రెజీనా కసాండ్రా (Regena Cassandrra) క‌థానాయిక‌లుగా చేస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ కాగా, నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్‌ను నిర్వహిస్తున్నారు.

Updated Date - Jun 23 , 2024 | 09:58 PM