Sukumar: ఆ విషయంలో సుక్కూకి రిగ్రెట్ తప్పదు
ABN, Publish Date - Dec 07 , 2024 | 05:25 PM
లవ్‌స్టోరీలు తెరకెక్కించడంతో సుకుమార్ మాస్టర్. అలాగే ఆయన ఏ జానర్ కథకైనా న్యాయం చేయగలదు. లవ్, మాస్, రస్టిక్, యాక్షన్, ఎమోషన్ జానర్ ఏదైనా సరే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దిట్ట. కానీ, పుష్ప విషయంలో మాత్రం ఆయన రిగ్రెట్ కాక తప్పదు. ఎందుకంటే..
లవ్‌స్టోరీలు తెరకెక్కించడంతో సుకుమార్ (Sukumar) మాస్టర్. అలాగే ఆయన ఏ జానర్ కథకైనా న్యాయం చేయగలదు. లవ్, మాస్, రస్టిక్, యాక్షన్, ఎమోషన్ జానర్ ఏదైనా సరే ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దిట్ట. తాజాగా ఆయన నుంచి వచ్చిన యాక్షన్ చిత్రం ‘పుష్ప-2’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. చక్కని కలెక్షన్లు రాబడుతోంది. అయితే మరో పక్క విమర్శలు అలాగే వస్తున్నాయి. పుష్ప-(Pushpa -2) చిత్రీకరణలో సుకుమార్ ప్రతిభ మిస్‌ఫైర్ అయిందని కామెంట్స్ వినబడుతున్నాయి.
Also Read- Janhvi kapoor: వాళ్లే మన సినిమా చూస్తుంటే మీకేంటి నొప్పి..
ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల వల్ల ఆయనతోపాటు సినిమాకు పని చేసిన టెక్నీషియన్లు సైతం రిగ్రెట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కారణం ఎవరైనా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బాహాటంగానే తన పెయిన్ ఏంటో చెప్పాడు. భన్వర్‌సింగ్ షెకావత్ పాత్రధారి ఫహాద్ ఫాజిల్ అయితే ఈ సినిమా వల్ల తనకు 0.1 శాతం కూడా ఒరిగిందేమీ లేదని పబ్లిక్‌గా చెప్పాడు. అందుకే అతను ప్రమోషన్స్‌లో కూడా పాల్గొనలేదు.
కథ, పాత్రలు, నిడివి వీటన్నింటిలో ఉన్న (Sukumar regrets) లోటుపాట్లను పక్కనపెడితే ముఖ్యంగా సుకుమార్‌ని ఎక్కువగా పాయింట్ చేస్తుంది స్విమ్మింగ్‌పూల్ సీన్‌లోనే. ఫహాద్ ఫాజిల్‌ని స్విమ్మింగ్‌పూల్‌లో తోసి హీరోతో ఆ నీటిలో మూత్ర విసర్జన చేయించడాన్ని తప్పుబడుతున్నారు. సుక్కులాంటి హై స్టాండర్డ్ టెక్నీషియన్ ఇలాంటి సీన్ పెట్టడం తన కెరీర్‌కి ఇదొక బ్లాక్ మార్క్ అని చెబుతున్నాయి. అప్పటికీ ఆ సన్నివేశంలో హీరో గోవిందప్ప సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వస్తే సెల్యూట్ చేస్తాం అని పుష్ఫ -1లో నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రను గుర్తు చేసుకున్నా.. జనాలు మాత్రం స్విమ్మింగ్‌పూల్ సీన్‌నే పట్టుకున్నారు.
అలాగే శ్రీవల్లి పాత్రతో పీలింగ్ ఫీలింగ్ అంటూ గదిలోకి లాక్కేళ్లే సీన్ విషయంలోనూ అలాంటి విమర్శలే ఎదురయ్యాయి. పైకి చెప్పినా, చెప్పకపోయినా సుక్కూ కెరీర్‌లో రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన సీన్స్ అని నెటిజన్లు అంటున్నారు. ‘‘అల్లు అర్జున్ ఫేక్ ఇమేజ్‌ను రి ప్రజంట్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న సిద్ధం సభలాంటిదని.. బన్నీ అభిమానులు నిజం కాదు.. క్రేజ్ నిజం కాదు, పబ్లిక్‌లో మాట్లాడిన మాటల్లో నిజం లేదు.’’ అనేలా కామెంట్స్ పడుతుండటం గమనార్హం.