Janaka Aithe Ganaka: సుహాస్‘జనక అయితే గనక’.. రిలీజ్ వాయిదా

ABN, Publish Date - Sep 04 , 2024 | 02:10 PM

మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రావాల్సిన సుహాస్ దిల్ రాజుల చిత్రం జ‌న‌క అయితే గ‌న‌క చిత్రం విడుద‌ల వాయిదా ప‌డింది. ఈ మేర‌కు చిత్ర యూనిట్ ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ చేసింది.

suhas

దిల్ రాజు ప్రొడక్షన్స్ (Dilrajuproductions) పతాకంపై రూపొందుతోన్న సినిమా ‘జనక అయితే గనక’(Janaka Aithe Ganaka). శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో, ప్ర‌స‌న్న‌వ‌ద‌నం వంటి వ‌రుస హిట్ చిత్రాల త‌ర్వాత‌ సుహాస్ (Suhas) హీరోగా నటించగా సంగీర్తన (Sangeerthana) క‌థానాయిక‌గా చేసింది. సందీప్‌ రెడ్డి బండ్ల (Sandeep Bandla,) దర్శకత్వం వ‌హించారు. విజ‌య్ బుల్గానిన్ (VijaiBulganin) సంగీతం అందించారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సినిమా ట్రైలర్ మంచి ఆద‌ర‌ణ‌ను కూడా ద‌క్కించుకుంది.

అయితే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయింది. ఈక్ర‌మంలో సెప్టెంబర్‌ 7న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న‌ట్లు విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు సైతం ప్రారంభించారు. ఇదిలాఉండ‌గా ఏపీ, తెంగాణ రాష్ట్రాల్లో తుఫాన్ వ‌ల్ల వ‌ర‌ద భీభ‌త్సం జ‌ర‌గడం, చాలామంది చ‌నిపోవ‌డం, ఇండ్లు మున‌గ‌డం, త‌దిత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తాయి.


ఈ నేప‌థ్యంలో ఈ జ‌న‌క అయితే గ‌న‌క (Janaka Aithe Ganaka) మూవీ టీం త‌మ సినిమా విడుద‌లను వాయిదా వేసుకున్నారు. ఈమేర‌కు సినిమా యూనిట్ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేస్తూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్టు చేసింది. తిరిగి సినిమా విడుద‌ల తేదీని త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

Updated Date - Sep 04 , 2024 | 02:10 PM