Sukumar: కేశవ పాత్రకు ఛాయిస్ అతనే...మట్టి నటుడు అనాలేమో..
ABN, Publish Date - Apr 27 , 2024 | 10:31 AM
సుహాస్ (Suhaas)హీరోగా నటించిన ‘ప్రసన్నవదనం’ (Prasanna vadanam) ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు సుకుమార్ (Sukumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన 'పుష్ప’ (Pushpa) చిత్రంతో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ (Kesava) పాత్రను తొలుత సుహాస్‌ను అనుకున్నామని చెప్పారు.
సుహాస్ (Suhaas)హీరోగా నటించిన ‘ప్రసన్నవదనం’ (Prasanna vadanam) ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు సుకుమార్ (Sukumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన 'పుష్ప’ (Pushpa) చిత్రంతో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ (Kesava) పాత్రను తొలుత సుహాస్‌ను అనుకున్నామని చెప్పారు. ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ ‘‘సుహాస్.. నువ్వుంటే నాకు, అల్లు అర్జున్‌కు ఇష్టం. నీ ఎదుగుదల చూస్తున్నాం. ‘పుష్ప’లోని హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవగా ముందు నిన్నే అనుకున్నాం. కానీ, అప్పటికే హీరోగా చేస్తున్న నిన్ను ఆ రోల్‌కి ఎంపిక చేయడం కరెక్ట్ కాదేమోనని అనిపించింది. నాని నటన నాకు బాగా ఇష్టం. సుహాస్.. ఫ్యూచర్ నానిలా అనిపిస్తున్నాడు. సహజ నటుడు నాని కాబట్టి సుహాస్‌ని మట్టి నటుడు అనాలేమో. ఇచ్చిన పాత్రల్లో అలా ఇమిడిపోతాడు’’ అని అన్నారు.
తన దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అర్జున్ గురించి మాట్లాడుతూ "నేను ‘జగడం’ సినిమా తీస్తున్న సమయంలో అర్జున్ నన్ను కలిశాడు. ‘మీ ‘ఆర్య’ చిత్రం నాకు బాగా నచ్చింది సర్. మీ వద్ద పని చేయాలనుకుంటున్నా’ అన్నాడు. టీమ్‌లో జాయిన్ చేసుకున్నా. చాలా అమాయకుడు. కానీ, లాజిక్ ఉన్నవాడు. అర్జున్, మరో అసిస్టెంట్ తోట శ్రీనుతో కలిసి 23 రోజుల్లో ‘100% లవ్’ స్టోరీ రాశా. అప్పటి నుంచి నా ప్రతి సినిమాకి వీరిద్దరు పనిచేశారు. వీళ్లతోపాటు ఒక్కో చిత్రానికి ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉండేవారు. అర్జున్ బిజీగా ఉండడంతో నేను లాజిక్ ఉన్న సినిమాలను మానేశా. అర్జున్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి.. నా అర్జున్‌ని సపోర్ట్ చేయండి’’ అని అన్నారు. సుహాస్ హీరోగా అర్జున్ వై.కె. తెరకెక్కించిన చిత్రమిది. పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్ హీరోయిన్లు. మే 3న సినిమా విడుదల కానుంది.
Puri Musings: ప్రశాంతంగా ఉండండి.. పక్కవారిని కూడా అలాగే ఉండనివ్వండి!
Read More: Tollywood, Cinema News