Maa Nanna Super Hero Teaser: సుధీర్ బాబు.. టీజ‌ర్‌తోనే గుండెలు పిండేశారుగా!

ABN, Publish Date - Sep 12 , 2024 | 06:14 PM

ఇటీవ‌ల హ‌రోంహ‌ర సినిమాతో మంచి విజ‌యం ద‌క్కించుకున్న నవ దళపతి సుధీర్ బాబు న‌టించిన‌ సినిమా ‘మా నాన్న సూపర్‌హీరో’. తాజాగా ఈ చిత్రం టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంటుంది.

Maa Nanna Super Hero

ఇటీవ‌ల హ‌రోంహ‌ర సినిమాతో మంచి విజ‌యం ద‌క్కించుకున్న నవ దళపతి సుధీర్ బాబు (Sudheer Babu) తాజాగా ఓ ఎమోష‌న‌ల్ సినిమా ‘మా నాన్న సూపర్‌హీరో’(Maa Nanna Super Hero) తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు. జీ5లో వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్‌ హిట్ కొట్టిన‌ ‘లూజర్’ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Kankara) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్స్ (V Celluloids) బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు (Sunil Balusu) నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. టీజ‌ర్‌ను చూస్తుంటూ మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు తండ్రీ కోడుకుల మ‌ధ్య బాండింగ్‌తో, ఎమోష‌న్ సీన్ల‌తో క‌ట్టి ప‌డేశారు. చాలాకాలం త‌ర్వాత షయాజీ షిండే (Sayaji Shinde) ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపిస్తుండ‌గా, మ‌రో ముఖ్య‌మైన పాత్ర‌లో సీనియ‌ర్ న‌టుడు సాయి చంద్ (Sai Chand), డ్యాన్స్ మాస్ట‌ర్ రాజు సుంద‌రం (Raju Sundaram) క‌నిపించునున్నారు. జై క్రిష్ సంగీతం అందిస్తున్నాడు.

Updated Date - Sep 12 , 2024 | 06:14 PM