Rajamouli-Sukumar: జక్కన్న... లెక్కల మాస్టర్‌ కలిసిన వేళ

ABN, Publish Date - Sep 26 , 2024 | 12:02 PM

సుకుమార్‌ (Sukumar) అంటే రాజమౌళికి (Rajamouli), ఆయన కుటుంబానికి ప్రత్యేకమైన అభిమానం.

సుకుమార్‌ (Sukumar) అంటే రాజమౌళికి (Rajamouli), ఆయన కుటుంబానికి ప్రత్యేకమైన అభిమానం. లెక్కల మాస్టర్‌ లాజిక్కులు, మ్యాజిక్కులు, ఆయన సినిమాల్లో హీరోని చూపించే విధానానికి ఫ్యాన్సే కాదు, జక్కన్న కూడా ఫిదా అయిపోయారు. ఇదే విషయాన్ని ఎన్నో సందర్భాల్లో రాజమౌళి చెప్పారు. అందుకే సుకుమార్‌ నీ, ఆయన సినిమాల్నీ ప్రత్యేక దృష్టితో చూస్తుంటారు. సుకుమార్‌కి కూడా రాజమౌళి అంటే చాలా గౌరవం.  సినిమాను తెరకెక్కించడంలో ఇద్దరి లెక్కలు వేరు. కానీ ఒకరి పనిని ఒకరు గౌరవించుకుంటారు. సలహా, సూచనలను పాజిటివ్‌గా స్వీకరిస్తారు. ఇప్పుడు వీరిద్దరూ ఓ చోట కలిశారు. 

ఇటీవల ‘పుష్ష 2’ (Pushpa 2) సెట్లో రాజమౌళి ప్రత్యక్షం అయ్యారు. చిత్రబృందంతో కాసేపు ముచ్చటించారు. సుకుమార్‌ తీసిన ఓ సీన్‌ను ఆయన కళ్లారా చూసి ‘అద్భుతం’ అని ప్రశంసించారు. గతంలో కూడా రాజమౌళి రంగస్థలం సెట్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పుష్ష 2 చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. అక్కడే.. మహేష్‌ బాబు (SSMB29) సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలెట్టారు రాజమౌళి. ఈ సందర్భంగా ‘పుష్ష 2’ సెట్‌ కి వెళ్లారు. ఆ సమయంలో బన్నీతో పాటుగా మిగిలిన ప్రధాన తారాగణం అంతా సెట్లోనే ఉంది. దాదాపు అరగంట సేపు.. రాజమౌళి సెట్ లో ఉన్నారని సన్నిహితుల నుంచి సమాచారం. దీనికి సంబంధించిన వీడియో త్వరలో రాబోతోంది. మహేష్‌ చిత్రానికి సంబంధించిన పనులు స్పీడప్‌ చేశారు జక్కన్న. ప్రస్తుతం ఎక్కువగా రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే గడుపుతున్నారు. మహేష్‌ కూడా సెట్‌కి వెళ్లక ముందే కొన్ని ప్రత్యేక కసరత్తులు చేయబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ అంతా ఫిల్మ్‌ సిటీలోనే జరగనుంది. ఇప్పటికే కొన్ని కసరత్తులు చేశారు. ఈ చిత్రం కోసం డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌లో కనిపిస్తున్నారు. 

Updated Date - Sep 26 , 2024 | 12:05 PM