SS Rajamouli: జపాన్ లో 83 ఏళ్ల వృద్థురాలి బహుమతికి జక్కన్న ఫిదా
ABN, Publish Date - Mar 19 , 2024 | 01:56 PM
ఇటీవల జపాన్ లో జరిగిన 'ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) స్క్రీనింగ్ కు వెళ్లిన రాజమౌళి (Rajamouli) అక్కడి ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు ఫిదా అయిపోయారు. 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) మార్చ్ నెల 2022లో విడుదలైంది.
ఇటీవల జపాన్ లో జరిగిన 'ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) స్క్రీనింగ్ కు వెళ్లిన రాజమౌళి (Rajamouli) అక్కడి ప్రేక్షకుల ప్రేమాభిమానాలకు ఫిదా అయిపోయారు. 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) మార్చ్ నెల 2022లో విడుదలైంది. ఇప్పటికి 750 రోజులు దాటింది. జపాన్ లో అక్టోబర్ 21, 2022లో విడుదలై 532 రోజులుగా థియేటర్‌లో ఆడుతూనే ఉంది. తాజాగా ఆ చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులతో వీక్షించడానికి రాజమౌళి, రమా జపాన్ వెళ్లారు. అక్కడి ప్రేక్షకుల అభిమానం చూసి పరవశించిపోయారు రాజమౌళి. వారి అభిమానాన్ని ప్రశంసిస్తూ ఎక్స్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘జపాన్‌వాసులు ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారు. అక్కడి ప్రజలు తమకు ఇష్టమైన వారికి ‘ఆర్గామి క్రేన్స్’ను లక్, హెల్త్, వెల్త్ కోసం బహూకరించడం సంప్రదాయం. ఈ చిత్రాన్ని వీక్షించిన 83 ఏళ్ల వృద్థురాలు 'ఆర్‌ఆర్‌ఆర్’ తనను ఎంతో మెప్పించిందని 1000 ‘ఆర్గామి క్రేన్స్’ను నాకు ఆప్యాయంగా ఇచ్చారు. అందుకోసం థియేటర్ బయట చలి గాలిలో ఆమె కొన్ని గంటలు ఎదురుచూశారు. వారి అభిమానానికి కృతజ్ఞతలు’’ అని రాజమౌళి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అంతే కాదు 'ఆర్‌ఆర్‌ఆర్ -2' అప్‌డేట్ కూడా ఇచ్చారు జక్కన్న. ఆర్‌ఆర్‌ఆర్ -2 చేసే ఆలోచన ఉంది. దానికి సంబంధించి ప్లాన్ ముందుగానే అనుకున్నాం. కానీ దానికి చాలా సమయం ఉంది’’ అన్నారు. మొదట రాసుకున్న స్క్రిప్ట్ లో ఎన్టీఆర్‌కు జోడీగా నటించిన జెన్నీ క్యారెక్టర్ చనిపోతుందని, ఆ తర్వాత కథలో మార్పులు చేసి ఆ పాత్రను కిల్ చేయకుండా ఉంచామన్నారు. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రధారులుగా నటించిన చిత్రం ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిగీరీలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది.
అలాగే మహేష్ బాబుతో చేయబోయే సినిమా అప్‌డేట్ కూడా ఇచ్చారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తామని, విడుదల సమయంలో హీరో మహేష్‌బాబుని జపాన్ తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తానని చెప్పారు.