పుష్ప 2 సెట్‌లో.. రాజ‌మౌళి! పుల్ జోష్‌లో సుకుమార్‌

ABN, Publish Date - Sep 26 , 2024 | 11:11 PM

పుష్ప 2 సినిమా షూటింగ్ లోకేష‌న్‌కు రాజ‌మౌళి వెళ్లి అక్క‌డి వారిని స‌ర్‌ఫ్రైజ్ చేశాడు. ఈ సంద‌ర్భంగా సుకుమార్ సంతోషం వ్య‌క్తం చేస్తూ వారు దిగిన‌ సెల్పీని షేర్ చేశారు.

sukumar

రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఇప్ప‌టికే దేవ‌ర సినిమా జాత‌ర మొద‌ల‌వ‌గా.. ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఆ సినిమా పేరే వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా ఓ ఇద్ద‌రు మ‌హామ‌హుల క‌ల‌యిక అభిమానుల‌కు అదిరిపోయే ఫీల్‌ను ఇస్తోంది. వాళ్లెవ‌రో కాదు తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన‌ రాజ‌మౌళి (Rajamouli), మ‌రోక‌రు పుష్ప (Pushpa) సినిమాతో ఆ స్థాయిని కంటిన్యూ చేసిన క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ (Sukumar).

తాజాగా పుష్ప 2 (Pushpa 2) సినిమా షూటింగ్ లోకేష‌న్‌కు.. మహేశ్‌బాబుతో తాను చేయబోయే సినిమా పనుల కోసం రాజ‌మౌళి (Rajamouli) కూడా అదే స్టూడియోకు వెళ్లి అక్క‌డి వారిని స‌ర్‌ఫ్రైజ్ చేశాడు. ఈ సంద‌ర్భంగా స‌కుమార్‌, పుష్ఫ‌2 సినిమాటోగ్రాఫ‌ర్ మిరోస్లా బ్రోజెక్ (Miroslaw Brozek) తో క‌లిసి రాజ‌మౌళి సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫొటోను ద‌ర్శ‌కుడు సుకుమార్ (Sukumar) త‌న ఇన్‌స్టాలో షేర్ చేస్తూ..

ద‌ర్శ‌కుల‌ బాహుబ‌లి (Bahubali) పుష్ప 2 సెట్‌లో.. రాజ‌మౌళి గారిని మా సినిమా సెట్‌లో చూడ‌డం మ‌రిచిపోలేని అనుభూతిని ఇచ్చింది, అత‌ను ఇక్క‌డికి రావ‌డం మాకు మ‌రింత ఉత్తేజాన్ని ఇచ్చిందంటూ పోస్టు పెట్టాడు. ఇప్పుడు ఈ పోస్టు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.. మీరూ చూసేయండి.

Updated Date - Sep 27 , 2024 | 06:14 AM