VB Entertainments Awards: శ్రీలక్ష్మీకి జీవిత సాఫల్య పురస్కారం..
ABN, Publish Date - Dec 21 , 2024 | 11:12 AM
వీబీ ఎంటర్టైన్మెంట్స్ విష్ణు బొప్పన (Vishnu Boppana) 2023-2024 సంవత్సరాలకుగాను, బుల్లి తెర అవార్డుని ప్రధానం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో అవార్డులు అందజేశారు.

వీబీ ఎంటర్టైన్మెంట్స్ విష్ణు బొప్పన (Vishnu Boppana) 2023-2024 సంవత్సరాలకుగాను, బుల్లి తెర అవార్డుని ప్రధానం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో అవార్డులు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత కె. అచ్చి రెడ్డి, అంబికా కృష్ణ. జేడీ లక్ష్మి నారాయణ, హీరో పూరి ఆకాష్, అర్చన తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నటి శ్రీలక్ష్మికి జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. టీవీ ఆర్టిస్ట్స్‌లకి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్‌కి, యూట్యూబర్స్‌కి కూడా అవార్డుని ప్రధానం చేశారు.