VishwakSen: విష్వక్‌ సేన్ 13 షురూ

ABN, Publish Date - Aug 06 , 2024 | 04:42 PM

విష్వక్‌ సేన్ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్థమయ్యారు. రెండు చిత్రాలు సెట్స్‌పై ఉండగా.. తాజాగా మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. విష్వక్‌సేన్ 13 వర్కింగ్‌ టైటిల్‌తో ఓ పోస్టర్‌ విడుదల చేశారు.


విష్వక్‌ సేన్ (Vishwak sen) వరుస సినిమాలతో అలరించేందుకు సిద్థమయ్యారు. రెండు చిత్రాలు సెట్స్‌పై ఉండగా.. తాజాగా మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. విష్వక్‌సేన్ 13 (VishwakSen 13) వర్కింగ్‌ టైటిల్‌తో ఓ పోస్టర్‌ విడుదల చేశారు. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీధర్‌ గంట (Sridhar Ganta) దర్శకత్వంలో తెరకెక్కనుంది. ‘కాంతార’ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజనీష్‌ దీనికి స్వరాలు అందించనున్నారు. పోస్టర్‌ చూస్తే ఇందులో విష్వక్‌ పోలీస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెలడించనున్నారు.

ప్రస్తుతం విష్వక్‌ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్‌ రాకీ’లో నటిస్తున్నారు. రాకీగా ఆయన మాస్‌ లుక్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది రానుంది.

దీనితో పాటు ఇటీవల ‘లైలా’ అనే కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన అమ్మాయిగా కనిపించనున్నారు. రామ్‌నారాయణ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. షైన్‌ స్ర్కీన్స్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.  

Updated Date - Aug 06 , 2024 | 08:39 PM