కీరవాణి తనయుడు.. మురళీమోహన్‌ మనవరాలు  

ABN, Publish Date - Nov 18 , 2024 | 08:12 AM

సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విన్నర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి (MM keeravani) చిన్న కుమారుడు శ్రీ సింహా (sri Simha) సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ (murlai mohan) మనవరాలు రాగ వివాహం త్వరలోనే జరగనుంది.


సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విన్నర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి (MM keeravani) చిన్న కుమారుడు శ్రీ సింహా (sri Simha) సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ (murlai mohan) మనవరాలు రాగ వివాహం త్వరలోనే జరగనుంది. ఆదివారం గోల్కోండ రిసార్ట్స్‌లో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. ఈ వేడుకలో ఆంధ్రజ్యోతి గ్రూప్‌ సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ (Vemuri Radha Krishna), ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, మహేశ్‌బాబు(Maheshbabu), రాజమౌళి, సితార, నరేశ్‌ తదితరులు పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

శ్రీసింహా దర్శకత్వ విభాగంలో పని చేసి నటుడిగా మారారు. బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించి మత్తు వదలరా, తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్‌సాలే, ఉస్తాద్‌, మత్తు వదలరా 2 చిత్రాల్లో హీరోగా కనిపించారు.  

ఇక మురళీ మోహన్‌ కొడుకు రామ్‌మోహన్‌కు  ఏకైక కుమార్తె  రాగ. కొద్దిరోజుల క్రితమే ఆమె బిజినెస్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం మురళీ మోహన్‌ కుటుంబ వ్యాపారా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  

+

READ ALSO: Vishwak sen: ఏ తప్పూ చేయట్లేదు.. చోరీలు చేయట్లేదు  


Updated Date - Nov 18 , 2024 | 08:22 AM