తమది కాని బతుకు.. తమదని నిరూపించుకునే తాపత్రయం! ఇంట్రెస్టింగ్‌గా శ్రీరంగనీతులు టీజర్
ABN, Publish Date - Jan 05 , 2024 | 07:51 PM
సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుంటున్నది.
యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు (Sri Ranga Neethulu). ఈ చిత్రం టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇదే ఫీల్ కలుగుతుంది. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి (Tanikella Bharni) పాత్ర చెప్పే మాటలతో ప్రారంభమై టీజర్ ఎంతో నేచురల్‌గా అనిపించే సంభాషణలతో, సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కొనసాగుతుంది.
విభిన్నమైన పాత్రలతో, వైవిధ్యమైన సినిమాలతో సినిమాలు చేస్తూ వైవిధ్యమైన సినిమాలతో తమకంటూ ఓ గుర్తింపును క్రియేట్ చేసుకున్న సుహాస్ (Suhas), కార్తీక్‌రత్నం (Karthik Rathnam), రుహానిశర్మ (Ruhani Sharma), విరాజ్ అశ్విన్ (viraj Ashwin) ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం శ్రీరంగనీతులు. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడ చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఈతరం యువత వారి ఆలోచనలను, వారి ఎమోషన్స్‌ను ఏ విధంగా వుంటున్నాయి అనేది ఈ చిత్రంలో వుండే పాత్రల ద్వారా చూపిస్తున్నాం. సినిమాలో ఉండే ఆసక్తికరమైన కథ, కథనాలను ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే మనసుకు హత్తుకుంటాయి. కొత్తదనంతో పాటు పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించిన చిత్రమిదని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు.. ఎంటర్ టైన్‌మెంట్ ఇలా అన్ని అంశాల కలయికతో దర్శకుడు చిత్రాన్ని అందర్ని అలరించే విధంగా తెరకెక్కించాడని, తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రానికి డీఓపీ: టీజో టామీ, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, అజయ్ అరసాడ, ఎడిటింగ్: శశాంక్ ఉప్పటూరి వ్యవహరిస్తున్నారు.