Sreeleela: తాతయ్య శ్రీలీల గురించి ఏం చెప్పారంటే!

ABN, Publish Date - Aug 01 , 2024 | 07:11 PM

చిన్న సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టి అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకొంది శ్రీలీల. అతి తక్కువ సమయంలో స్టార్‌డమ్‌ సంపాదించుకుంది.

Sreeleela

చిన్న సినిమాతో కెరీర్‌ మొదలుపెట్టి అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకొంది శ్రీలీల. అతి తక్కువ సమయంలో స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. తన డాన్సులతో కుర్రకారును ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సౌత్‌ ఇండియన్‌ సెన్సేషన్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా విడుదలైంది. ఇందులో శ్రీలీలను ఉద్దేశించి ఆమె తాతయ్య మాట్లాడారు. ఆమె విషయంలో తానెంతో గర్వంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

‘‘నా పేరు నాగేశ్వరరావు. శ్రీలీలకు తాతగా.. ఆమె విషయంలో చాలా గర్వంగా ఉన్నా. ప్రస్తుతం సినిమాల్లో రాణిస్తూనే ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతుంది. మరో కొన్ని నెలల్లో చదువు పూర్తి కానుంది. నా కుమార్తె ఒక డాక్టర్‌. ఆమెను చూసి మనవరాలు డాక్టర్‌ కావాలనుకుంది. చదువుకుంటూనే సినిమాల కోసం ఎంతో కష్టపడి వర్క్‌ చేస్తుంది. అందుకు సంతోషంగా ఉన్నా’’ అని ఆయన తెలిపారు. 

తదుపరి శ్రీలీల మాట్లాడుతూ.. ‘‘మా తాతయ్య వల్లే సినిమాల్లో ఉన్నా. నటిగా రాణిస్తున్నా. ఎందుకంటే, మాది విద్యావంతుల కుటుంబం. మా ఫ్యామిలీలో ఇంజినీర్స్‌, డాక్టర్స్‌ ఎక్కువ. సినిమాల్లోకి వచ్చేందుకు తాతయ్య ప్రోత్సహం అందించారు. ఆయన వల్లే ఈ స్థ్థాయిలో ఉన్నా’’ అని చెప్పారు. ‘గుంటూరు కారం’తో అలరించిన శ్రీలీల ప్రస్తుతం తెలుగుతోపాటు బాలీవుడ్‌లోనూ యాక్ట్‌ చేస్తున్నారు. ‘రాబిన్‌హుడ్‌’, ‘ఉస్తాద్‌ భగతసింగ్‌’, ‘రవితేజ 75’లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఓ ప్రాజెక్ట్‌ కోసం ఆమె సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌ హీరోగా పరిచయం కానున్న సినిమాలో హీరోయిన్‌గా కనిపించనున్నారని టాక్‌. 

Updated Date - Aug 01 , 2024 | 07:49 PM