Sree Vishnu19: డైరెక్టర్ బాబీ, కోన వెంకట్ సమర్ఫణలో.. శ్రీవిష్ణు కొత్త చిత్రం
ABN, Publish Date - Apr 10 , 2024 | 10:39 AM
సామజవరగమన, ఓం భీమ్ బుష్ వంటి వరుస బ్లాక్‌బస్టర్స్ తో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హీరో శ్రీవిష్ణు తాజాగా తన 19వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.
సామజవరగమన, ఓం భీమ్ బుష్ వంటి వరుస బ్లాక్‌బస్టర్స్ తో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) తాజాగా తన 19వ (#SreeVishnu19) చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించనున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP (Skanda Vahana Motion Pictures), విజిల్ వర్తీ ఫిల్మ్స్ (Whistle Worthy Films ) & KFC (Kona Film Corporation) ప్రొడక్షన్ నంబర్ 1గా అనూష ద్రోణవల్లి, సీతా కుమారి కొత, గోపాలం లక్ష్మీ దీపక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి (Bobby), ప్రముఖ రచయిత కోన వెంకట్ (KONA VENKAT) ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా, పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో మంగళవారం ఘనంగా ప్రారంభమైది. నవీన్ యెర్నేని, నందిని రెడ్డి, కిషోర్ తిరుమల స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. దిల్ రాజు (DilRaju) క్లాప్ కొట్టగా, అనిల్ రావిపూడి (Anil Ravipudi) కెమెరా స్విచాన్ చేశారు. తొలి షాట్‌కి వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తం వేడుకకు సాహు గరిపాటి, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, శరత్ మరార్, సితార నాగ వంశీ, బివిఎస్ రవి, తదితరులు హాజరయ్యారు.
మూవీ లాంచింగ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) మాట్లాడుతూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజున ఈ సినిమా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం బాబీ గారు ప్రొడక్షన్ లోకి రావడం చాలా ఆనందంగా వుంది. అలాగే కోనగారు, కృష్ణ గారికి ధన్యవాదాలు. ఇది చాలా డిఫరెంట్ స్క్రిప్ట్. డీవోపీ సాయి శ్రీరామ్, విజయ్ బులగానిన్ మ్యూజిక్. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, రైటర్స్ భాను, నందు.. టీం అంతా బాగా కుదిరింది. ఈ సినిమాతో జానకి రామ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నందు చాలా అనందంగా ఉందన్నారు. చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా అందరికీ కూడా ఆహ్లాదకరమైన సినిమా ఇస్తామని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. అందరికీ హ్యాపీ ఉగాది. ఈ సినిమాలో భాగం అవ్వడానికి కారణం.. నా టీంలో లేదా బయట.. నిర్మాతలని అప్రోచ్ అవ్వాలని చాలా మంది అడుగుతుంటారు. మనమే ధైర్యంగా ఓ అడుగువేసి ముందుకు రావాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉండేది. జానకి రామ్ 'పవర్' సినిమా నుంచి నా దగ్గర అసోషియేట్ గా చేస్తున్నారు. శ్రీవిష్ణు (Sree Vishnu) పేరు చెప్పగానే వెంటనే ఓకే అన్నాను. ఈ కథ హిలేరియస్ గా, ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. సహా నిర్మాతలందరరికీ ఆల్ ది బెస్ట్. డీవోపీ సాయి శ్రీరామ్, విజయ్ బులగానిన్ మ్యూజిక్. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, రైటర్స్ భాను, నందు అంతా బెస్ట్ టీం ఉన్నారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్.' తెలిపారు.
రైటర్ కోనవెంకట్ మాట్లాడుతూ.. అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నాకు, బాబీకి ప్రతి రోజు ఏవో క్రియేటివ్ ఆలోచనలు పుట్టుకోస్తుంటాయి. తన ఆలోచనలన్నీ ఛానలైజ్ చేయడానికి విజిల్ వర్తీ ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి నిర్మాణంలో రావడం చాలా ఆనందంగా ఉంది. బాబీ మాస్ రైటర్, డైరెక్టర్. తను నిర్మించిన సినిమా కూడా ప్రేక్షకులు విజిల్ వేసేలా ఉండాలనే ఆలోచనతో విజిల్ వర్తీ ఫిలిమ్స్ అని పేరుపెట్టడం నాకు చాలా నచ్చింది. శ్రీవిష్ణు (Sree Vishnu)తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. డీవోపీ సాయి శ్రీరామ్, విజయ్ బులగానిన్ మ్యూజిక్. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, రైటర్స్ భాను, నందు ఇలా మంచి టీంతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ వేడుక విచ్చేసిన అతిధులందరికీ ధన్యవాదాలు' తెలిపారు.
శ్రీవిష్ణు డిఫరెంట్ జానర్ సినిమాలు చేయడంతో పాటు ప్రతి సినిమాలో తగిన వినోదం ఉండేలా చూసుకుంటున్నారు. #SreeVishnu19 మరొక ఆసక్తికరమైన థీమ్‌తో కూడిన ఫన్ ఫిల్డ్ ఎడ్వంచర్. భాను భోగవరపు కథను అందించగా, నందు సవిరిగాన డైలాగ్స్ రాస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, విజయ్ బులగానిన్ (Vijai Bulganin) సంగీతం అందించనున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, నారిని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర వివరాలు త్వరలో మేకర్స్ తెలియజేయనున్నారు.