మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Om Bheem Bush: ఓం భీమ్ బుష్.. సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే!

ABN, Publish Date - Mar 20 , 2024 | 03:12 PM

శ్రీవిష్ణు , ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, కాంబినేషన్‌లో తెర‌కెక్కిన చిత్రం ఓం భీమ్ బుష్ మార్చి 22న రిలీజ్‌కి సిద్ధమైంది.

Om Bheem Bush

శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, శ్రీహర్ష కొనుగంటి, యువి క్రియేషన్స్ , వి సెల్యులాయిడ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిన చిత్రం ఓం భీమ్ బుష్ (Om Bheem Bush) మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కి సిద్ధమైంది. ఇప్ప‌టికే సెన్సార్ నుంచిసి U/A సర్టిఫికేట్‌ను అందుకున్న ఈ సినిమా ప్రీమియ‌ర్స్‌ను ఈ నెల 21 గురువారం రోజున‌ ఓవర్సీస్ స‌హా కొన్ని ప్రాంతాలలో ప్రదర్శించనున్నారు.

‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) పర్ఫెక్ట్ సమ్మర్ ఔటింగ్, ఇది యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ల‌క్ష్యంగా చేసుకుని వ‌స్తున్న ఈ సినిమా ఈ వేస‌వి సెల‌వుల‌కు ఫ‌ర్ఫెక్ట్ సినిమా అని ట్రైల‌ర్ చూస్తే తెలుస్తోంది. మొద‌ట కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో బ్యాంగ్ బ్రోస్ ఫన్ ధమాకాతో సినిమా ప్రారంభమై, ఆ తర్వాత భైరవపురం అనే గ్రామానికి చేరుకుని అక్క‌డా నిధి వేట చుట్టూ క‌థ‌నం ఉండ‌నుంది.


ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, సినిమా చివర్లో భారీ ఎమోషన్‌తో ఊహించని ట్విస్ట్‌లు కూడా ఉండ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఓం భీమ్ బుష్ (Om Bheem Bush) సినిమాలో హై ఎంటర్ టైన్ మెంట్‌తో పాటు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని, వన్ లైనర్లు మరింతగా అలరించనున్నాయి. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హిలేరియ పాత్రలు మేజర్ ఎట్రాక్షన్స్.

Updated Date - Mar 20 , 2024 | 03:12 PM