SP Charan: భావోద్వేగాలను రీక్రియేట్ చేయలేరు
ABN, Publish Date - Nov 28 , 2024 | 03:45 PM
‘ఏఐతో వాయిన్‌ను రీక్రియేట్ చేయడానికి నేను వ్యతిరేకిని. ఇటీవల వచ్చిన ‘మనసిలాయో..’ (వేట్టయాన్)పాట చాలా హిట్ అయింది.
గాన గంధర్వుడు ఎస్‌పి. బాల సుబ్రహ్యణ్యం (SPB) వాయిస్‌ను ఏఐతో రీక్రియేట్ (AI technology) చేయడానికి అంగీకరించకపోవడానికి కారణాన్ని వివరించారు ఆయన తనయుడు ఎస్.పి చరణ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎస్పీ చరణ్ (SP Charan) మాట్లాడుతూ "ఏఐ ఉపయోగించి వాయిస్‌ను రీక్రియేట్ చేస్తే సహజత్వం ఉండదని అభిప్రాయపడ్డారు. ‘వేట్టయాన్’లో దివంగత గాయకుడు మలేషియన్ వాసుదేవన్ గాత్రాన్ని ఏఐతో రీక్రియేట్ చేసిన మనసిలాయో పాట గురించి ప్రస్తావించారు. ‘ఏఐతో వాయిన్‌ను రీక్రియేట్ చేయడానికి నేను వ్యతిరేకిని. ఇటీవల వచ్చిన ‘మనసిలాయో..’ (వేట్టయాన్)పాట చాలా హిట్ అయింది. ఒకవేళ ఎస్పీబీ జీవించి ఉంటే ఆ పాట కోసం ఆయన్ని సంప్రదించి ఉండేవారేమో. మనందరికీ ఎస్పీబీ, మలేషియన్ వాసుదేవన్‌ల మీద ఉన్న ప్రేమ కారణంగా వాళ్ల వాయిస్‌లను రీక్రియేట్ చేయాలనిపిస్తుంది.