యాంటీ డ్రగ్స్‌పై ‘డేంజర్’ పాట.. హీరో కృష్ణసాయికి ప్రశంసలు
ABN, Publish Date - Aug 13 , 2024 | 06:01 PM
ఇటీవల సుందరాంగుడు సినిమాతో అలరించిన నటుడు కృష్ణసాయి. రీసెంట్‌గా ఈ నటుడు తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ (ఐపిఎస్) నుంచి అభినందనలు అందుకున్నాడు.
ఇటీవల సుందరాంగుడు సినిమాతో అలరించిన నటుడు కృష్ణసాయి (Krishna Sai). తాజాగా ‘జ్యువెల్ థీఫ్’ (Jewel Thief ) అనే సినిమా చేస్తున్నాడు. మీనాక్షి జైస్వాల్ హీరోయిన్. పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. అయితే సామాజిక స్పృహ ఎక్కువగా ఉన్న ఈ నటుడు రీసెంట్‌గా తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ (ఐపిఎస్) నుంచి అభినందనలు అందుకున్నాడు.
నిరంతరం ఏదో ఒక సామాజిక కార్యక్రమం నిర్వహిస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న ఈ హీరో కృష్ణ సాయి (Krishna Sai) తన కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా డ్రగ్స్‌పై యువతకు, వారి తల్లిదండ్రులకు చైతన్యం కల్పించే విధంగా తనవంతు సామాజిక సేవ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా యాంటీ డ్రగ్స్‌పై కృష్ణసాయి రూపొందించిన డేంజర్ పాటను తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ (ఐపిఎస్) వీక్షించి కృష్ణసాయిని అభినందించారు. రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ కృష్ణసాయి హీరోనే అని ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా కృష్ణ సాయి (Krishna Sai) మాట్లాడుతూ.. సామాజిక అవగాహనలో భాగంగా Danger ‘say no to Drugs..’ అనే ప్రత్యేక పాటను చిత్రీకరించామని తెలిపారు. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ గారు ఈ పాటను వీక్షించి అభినందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చాలా మంది యువత డ్రగ్స్ (drugs) ఊబిలో చిక్కుకుని జీవితాలను నష్టపోతున్నారని, డ్రగ్స్ అలవాటు పడిన వారు బయటకు రాలేకపోతున్నారని, నగరాల్లో డ్రగ్స్ బాధితులు చాలా మంది ఉంటున్నారని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలనపై తమ కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్టు ద్వారా అవగాహన కల్పిస్తున్నామని ఆయనతెలిపారు.