Sonali bindre - Murari: 23 ఏళ్ల తర్వాత కూడా అదే ప్రేమ!
ABN, Publish Date - Aug 10 , 2024 | 08:09 PM
'మురారి’ చిత్రం రీ రిలీజ్‌పై హీరోయిన్ సోనాలి బింద్రే స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు. "
'మురారి’ (Murari) చిత్రం రీ రిలీజ్‌పై హీరోయిన్ సోనాలి బింద్రే (Sonali bindre) స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు. "మహేశ్‌తో (Mahesh babu)మురారి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.. 23 ఏళ్ల తర్వాత కూడా మురారి సినిమాపై అదే ప్రేమ చూపించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ఈ చిత్రాన్ని మాకు ఇంత ప్రత్యేకంగా మార్చిన డైరెక్టర్ కృష్ణ వంశీకి అభినందనలు’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ 'మురారి’ రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద మహేశ్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అభిమాన హీరో సినిమా 23 ఏళ్ల తర్వాత రావడంతో కోలాహలం సృష్టించారు. కొందరైతే ఏకంగా థియేటర్లోనే పెళ్లి కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. క్యాన్సర్‌ను జయించిన సోనాలి బింద్రే మళ్లీ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం పలు సినిమాలు, సిరీస్‌లతో బిజీగా ఉంది.