Sobhita Dhulipala: చైతూకి అక్కడే పడిపోయా.. ఆ నమ్మకం ఉంది

ABN, Publish Date - Dec 08 , 2024 | 08:41 PM

ఎప్పటి నుంచో ఎదురు చూసిన ప్రేమ చైతూ రూపంలో తనకు దక్కిందని శోభిత ధూళిపాళ్ల అన్నారు. ఇటీవల ఆమె వివాహం నాగచైతన్యతో జరిగిన సంగతి తెలిసిందే. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శోభిత తన వ్యక్తిగత అభిరుచులు గురించి, భర్త నాగచైతన్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు

ఎప్పటి నుంచో ఎదురు చూసిన ప్రేమ చైతూ రూపంలో తనకు దక్కిందని శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) అన్నారు. ఇటీవల ఆమె వివాహం నాగచైతన్యతో జరిగిన సంగతి తెలిసిందే. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శోభిత తన వ్యక్తిగత అభిరుచులు గురించి, భర్త నాగచైతన్య (Naga Chaitanya) గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం ఎంతో అదృష్టం. సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరుల పట్ల మర్యాదగా ఉంటూ, హుందాగా ప్రవర్తించే చైతూ లక్షణాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. చాలా బాగా చూసుకుంటాడు’’ అంటూ భర్త నాగచైతన్య పై పొగడ్తల వర్షం కురిపించింది.



నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలినాళ్లలో తనకు ఎన్నో తిరస్కరణలు ఎదురయ్యాయని శోభిత అన్నారు. "అందంగా లేనని, ఆకర్షణీయంగా కనిపించనని నా ముఖం మీదే చెప్పేవారు. ఓ ప్రముఖ కంపెనీ వాణిజ్య ప్రకటనల కోసం ఆడిషన్స్‌కు వెళితే బ్యాక్‌ గ్రౌండ్‌ మోడల్‌గా కూడా పనికిరానని చెప్పడం  నన్ను ఎంతో బాధించింది. అయితే, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి కొన్నాళ్ల తర్వాత అదే కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యాను.

నాకు ఏదైన కథ పాత్ర నచ్చితేనే  అంగీకరిస్తాను. ఎప్పుడూ తెరపై కనిపించాలనే కోరిక నాకు లేదు. అభిరుచికి తగ్గ పాత్రలే చేస్తాను’’ అని చెప్పారు. ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’ అంటూ చైతన్య జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన మరిన్ని ఫొటోలను షేర్‌ చేశారు.
 

Updated Date - Dec 08 , 2024 | 08:41 PM