మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sivaji Raja: ‘నాన్నా మ‌ళ్లీ రావా’.. ‘మాతృదేవోభ‌వ’ లాంటి అరుదైన సినిమా

ABN, Publish Date - Apr 23 , 2024 | 06:12 PM

శివాజీరాజా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ‘నాన్నా మ‌ళ్లీ రావా! తాజాగా మూవీ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్‌ విడుద‌ల చేశారు.

nanna malli raava

శివాజీరాజా ( ShivajiRaja) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ‘నాన్నా మ‌ళ్లీ రావా..! (Nanna Malli raava)’ హార్ట్ ట‌చింగ్ స‌బ్జెక్టు, బ‌ల‌మైన సెంటిమెంట్‌తో ‘మాతృదేవోభ‌వ’ లాంటి మ‌రో అరుదైన సినిమాగా రాబోతోంది. తాజాగా మూవీ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్‌ విడుద‌ల చేశారు. హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టీఎఫ్‌పీసీ సెక్ర‌ట‌రీ టీ. ప్ర‌స‌న్న‌కుమార్, ద‌ర్శ‌క‌నిర్మాత బాబ్జీ, నిర్మాతలు వై. సురేంద‌ర్ రెడ్డి, న‌రేష్ వ‌ర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి ‘నాన్నా మ‌ళ్లీ రావా..!’ మూవీ పోస్ట‌ర్‌ను లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ.. ఇలాంటి భావోద్వేగంతో మిలిత‌మైన‌ సినిమాలో న‌టించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ జాన‌ర్ చిత్రాలు అరుదుగా వ‌స్తుంటాయ‌ని, కుటుంబ స‌మేతంగా చూడ‌గ‌లిగే ఈ సినిమా ప్ర‌తి ఒక్క‌రిలో భావోద్వేగాలు నింపుతాయ‌ని అన్నారు. టీఎఫ్‌పీసీ సెక్ర‌ట‌రీ టీ. ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ.. ”పిల్ల‌ల కోసం బాధ‌ల‌ను దిగ‌మింగుకుని, జీవితాన్నే ప‌ణంగా పెట్టేసే నాన్న విలువ అమ్మ త‌మ పిల్ల‌ల‌కు చెప్పాలి. ‘నాన్నా.. మ‌ళ్లీ రావా..’ అంటూ ప్ర‌తి ఒక్క‌రిని భావోద్వేగానికి గుర‌య్యే సినిమా ఇది..” అని అన్నారు.


అనంత‌రం దర్శకుడు నిర్దేష్ మాట్లాడుతూ.. వెంకన్న క్యారెక్టరే నన్ను ఈ కథ రాయించినట్టు అనిపించింది. నాన్న అంటే ప్రతి ఒక్కరికి చెప్పుకోలేనంత భావోద్వేగం ఉంటుంది. థియేటర్‌లో ఈ సినిమా చెప్ప‌లేనంత భావోద్వేగం ప్రేక్ష‌కుల‌ను పట్టేస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను..” అని అన్నారు. పోస్ట‌ర్ లాంచ్‌కు వ‌చ్చి చిత్ర‌యూనిట్‌ను ఆశీర్వ‌దించిన సినీ పెద్దల‌కు ఈ చిత్ర నిర్మాత‌ డా. ఉమా మ‌హేశ్వ‌ర రావు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు పూర్తి స్థాయిలో న‌చ్చే స‌బ్జెక్టుతో ఈ సినిమా తెర‌కెక్కుతున్న‌ట్టు ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలిపారు. ప్ర‌స్తుతం ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌యింద‌న్నారు.

Updated Date - Apr 23 , 2024 | 06:39 PM