Singer Harika Narayan: ప్రియుడిని పెళ్లాడిన గ్లామరస్ సింగర్!
ABN, Publish Date - Mar 18 , 2024 | 04:32 PM
టాలీవుడ్ క్రేజీ సింగర్ హారికా నారాయణ్ వివాహం తన ప్రియుడు పృథ్వీ వెంపటితో జరిగింది. ఏడేళ్లగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఏడడుగులు వేశారు.
టాలీవుడ్ క్రేజీ సింగర్ హారికా నారాయణ్ వివాహం తన ప్రియుడు పృథ్వీ వెంపటితో జరిగింది. ఏడేళ్లగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఏడడుగులు వేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పెళ్లి వేడుకలో సంగీత దర్శకులు కీరవాణి, మణిశర్మ, కోటితోపాటు సింగర్ రేవంత తదితరులు సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ సంగీత విధ్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ బంధువు హారికా నారాయణ్. మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి జర్మనీ వెళాలనుకున్న ఆమె సింగర్ అయ్యారు. తన గానంతో యువతను ఉర్రుతలూగించారు. ‘ఆచార్య’లోని ‘లాహే లాహే’, ‘సర్కారు వారి పాట’లో టైటిల్ ట్రాక్ ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ నెల 6వ తేదిన హారికా నారాయణ్ నిశ్చితార్థం జరిగింది. అప్పుడే తన ప్రియుడు పృథ్వీనీ సోషల్ మీడిమా వేదికగా పరిచయం చేసింది. ‘‘అందమైన స్నేహం.. ప్రేమగా మారింది. ఏడేళ్ల ప్రయాణం తర్వాత నీతో బంధాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్థంగా ఉన్నా’’ అని ఆమె పోస్ట్ చేసింది.