మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tillu Square: న‌ల్ల‌మ‌ల అడ‌వి ఓ న‌ల్ల‌ చీర ఫిల్మ్ బై రాధిక.. 'టిల్లు స్క్వేర్' గ్లింప్స్ విడుదల

ABN, Publish Date - Feb 07 , 2024 | 06:51 PM

ఈ రోజు(ఫిబ్రవరి 7) సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం ఈ సినిమా నుంచి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది.

dj tillu

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) అనతికాలంలోనే ప్రేక్షకులకు ఇష్టమైన నటుడిగా మారిపోయారు. ముఖ్యంగా ఆయన నటించిన 'డీజే టిల్లు' చిత్రం కల్ట్ స్టేటస్ సాధించింది. ఆ సినిమాలో సిద్ధు పలికిన "అట్లుంటది మనతోని", "నువ్వు అడుగుతున్నావా రాధిక" వంటి మాటలు.. సోషల్ మీడియాలో మీమ్స్‌గా మారడమే కాకుండా, నిజ జీవితంలో యువత రోజువారీ సంభాషణలుగానూ మారిపోయాయి. అంతలా 'డీజే టిల్లు' చిత్రం, అందులోని సిద్ధు పాత్ర ప్రేక్షకులపై ప్రభావం చూపాయి.

ఐకానిక్ క్యారెక్టర్ 'టిల్లు'తో ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధు జొన్నలగడ్డ.. 'డీజే టిల్లు' చిత్రానికి కొనసాగింపుగా 'టిల్లు స్క్వేర్స (Tillu Square ) చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఇప్పటికే "టికెట్టే కొనకుండా", "రాధిక" పాటలను విడుదల చేయగా.. రెండు పాటలూ విశేషంగా ఆకట్టుకొని, చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి.


ఫిబ్రవరి 7న సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం ఈ సినిమా నుంచి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో టిల్లు కారు న‌డుపుతండ‌గా వెన‌కాల కూర్చున అత‌ని ఫ్రెండ్ టిల్లుకు హ్య‌పీ బ‌ర్త్ డే అని చెప్ప‌గా.. ప‌క్క‌నే కూర్చున్న లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) Anupama Parameswaran అయ్యో స్వారీ అంటూ ముద్దు పెట్టి హ్యాపీ బ‌ర్త్ డే అని చెబుతుంది. ఈ సంద‌ర్భంగా లాస్ట్ ఇయ‌ర్ నీ పుట్టిన‌రోజు ఎలా జ‌రిగింది అని అడుగుతుంది. ఈక్ర‌మంలో టిల్లు లాస్ట్ ఇయ‌ర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రాధిక‌తో క‌లిసి చేసిన వ్య‌వ‌హారాల‌ను గుర్తు చేసుకునే స‌న్నివేశాల‌ను ఈ గ్లిమ్స్‌లో చూయించారు.

లాస్ట్ ఇయ‌ర్ ఫ్రెండ్స్ అంతా క‌లిసి న‌ల్ల‌మ‌ల అడ‌వి ఓ న‌ల్ల‌ చీర ఫిల్మ్ బై రాధిక అనే ఓ సినిమా చూశామ‌ని రాధిక అనే పెద్ద డైరెక్ట‌ర్ ఆ సినిమా తీసింద‌ని, ఆమె క‌థ‌లు చాలా చెబుతుందని, సినిమా అన్ని ర‌కాల జాన‌ర్‌లో ఉంటుంద‌ని, అది ఓటీటీటీ సినిమా అని, పాన్ మ‌ల్కాజిగిరి అంటూ చెబుతూ రాధికతో జరిగిన విషయాల గురించి చెప్పకుండా తనదైన స్టైల్లో ఆ సంద‌ర్భాన్ని ముగించ‌డం వ‌ర‌కు గ్లిమ్స్‌లో చూపించారు. అయితే ఈ గ్లింప్స్‌ 'డీజే టిల్లు'లో జరిగిన విషయాలను గుర్తు చేయడమే కాకుండా, 'టిల్లు స్క్వేర్' ఎలా ఉండబోతుందనే ఆసక్తిని కూడా కలిగిస్తోండ‌గా ఈ సినిమా ట్రైలర్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

ఎస్ థమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం సమకూరుస్తుండ‌గా, మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించ‌గా శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2024, మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

Updated Date - Feb 07 , 2024 | 07:04 PM