Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ మాస్ ప్రాజెక్ట్.. దసరాకి ఎమన్నా గిఫ్ట్

ABN, Publish Date - Oct 12 , 2024 | 11:58 AM

ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఒక జాతీయ సంపద గురించి టచ్ చేయని జాన్రా లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఓ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే..

Kohinoor Poster

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ఏ సినిమా తీసిన సంచలనమే. 'డీజే టిల్లు, టిల్లు స్క్వేర్' సినిమాలతో సిద్దు స్టార్ బాయ్ గా సంపాదించినా కల్ట్ మామూలుది కాదు. దీంతో సిద్దు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటని అందరి కళ్ళు పడ్డాయి. ప్రస్తుత్తం ఆయన నీరజ కోన నిర్మిస్తున్న 'తెలుసు కదా!' సినిమాలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే టిల్లు గాడికి స్టార్‌డమ్ తీసుకువచ్చిన ప్రొడ్యూసర్ నాగ వంశీతో మరో పాన్ ఇండియన్ కాదు కాదు యాన్ ఇండియా(An India) సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఒక జాతీయ సంపద గురించి టచ్ చేయని జాన్రా లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఓ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే..


భారతీయ చలన చిత్ర చరిత్రలో కనివీని ఎరగని స్థాయిలో "కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం" అనే సంచలన కథాంశంతో ఈ చిత్ర కథను రూపొందిస్తున్నట్లు ఫిల్మ్ మేకర్స్ సెన్సేషనల్ అనౌన్స్ మెంట్ చేశారు. 'క్షణం', 'కృష్ణ అండ్ హిజ్ లీల' వంటి అమేజింగ్ సినిమాలు అందించిన రవికాంత్ పేరెపు ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. యాక్టర్ గానే కాకుండా ఒక యంగ్ రైటర్ గా ప్రతిభావంతుడైన సిద్దు.. మంచి డైవర్సిటీ ఉన్న స్టోరీలను మాత్రమే ఎన్నుకుంటాడు. అలాగే ప్రపంచస్థాయి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దీంతో సిద్దు, నాగ వంశీ కాంబినేషన్లో మూడో ఐకానిక్ థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్‌ ఖాయం అంటున్నారు.


భద్రకాళి మాత మహిమగా నిలిచిన ఐకానిక్ కోహినూర్ వజ్రం సామ్రాజ్యవాదుల చేతికి చిక్కింది. కోహినూర్ వజ్రాన్ని తిరిగి మూలాల్లోకి తీసుకురావడానికి యువకుడు సాగించే చారిత్రాత్మక ప్రయాణంగా ఈ చిత్రం రూపొందనుంది. కోహినూర్ ను తిరిగి తీసుకురావడం అంత తేలికైన పని కాదు. కథాంశమే కాదు, కథాకథనాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండబోతున్నాయి. న్యాయంగా మనకు చెందాల్సిన వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చి, శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికి, చరిత్ర సృష్టించడానికి మన స్టార్ బాయ్ సిద్ధంగా ఉన్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Updated Date - Oct 12 , 2024 | 12:00 PM