మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shivani Rajashekar: రెండు సంవ‌త్స‌రాలుగా.. రాహుల్‌తోనే

ABN, Publish Date - May 15 , 2024 | 06:00 PM

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా రాహుల్ విజ‌య్ తోనే వ‌ర్క్ చేస్తున్నాన‌ని శివాని రాజ‌శేఖ‌ర్ చెప్పుకొచ్చింది. తాజాగా ఈ ముద్దుగ‌మ్మ న‌టించిన విద్య వాసుల అహం ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది, ఈ క్ర‌మంలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలిపింది.

shivani rajashekar

గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా రాహుల్ విజ‌య్ (Rahul Vijay) తోనే వ‌ర్క్ చేస్తున్నాన‌ని జీవితా ,రాజ‌శేఖ‌ర్‌ల గారాల ప‌ట్టి శివాని రాజ‌శేఖ‌ర్ (Shivani Rajashekar) చెప్పుకొచ్చింది. తాజాగా ఈ ముద్దుగ‌మ్మ న‌టించిన విద్య వాసుల అహం (Vidya Vasula Aham) అనే సినిమా త్వ‌ర‌లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది, ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ మీడియా స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సందర్భంగానే శివాని మాట్లాడుతూ కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలిపింది.

నాకు ద‌ర్శ‌కుడు మనికాంత్ (Manikanth Gelli) కథ చెప్పినప్పుడు ఫ‌స్ట్‌ హీరో ఎవరని అడిగితే రాహుల్ విజయ్ అని అన్నార‌న్నారు. రాహుల్ నాకు చిన్నప్పటి నుంచి తెలిసి ఉండ‌డ‌మే కాక‌ మంచి రైటర్ కూడా కావ‌డంతో సినిమాను ఓకే చేశాన‌ని తెలిపింది. రాహుల్ (Rahul Vijay) ఒకే చేసాడంటే కథ బాగుంటుందని అర్ధమై నేను కూడా ఒకే చేశానని శివాని రాజ‌శేఖ‌ర్ (Shivani Rajashekar) స్ప‌ష్టం చేసింది.


ఇదిలాఉండ‌గా ఈ విద్య వాసుల అహం (Vidya Vasula Aham) కథ ఒప్పుకున్న ఆరు రోజుల్లోనే కోట బొమ్మాళి ఒకే అయ్యిందన్నారు. అలా చివ‌రి రెండు సంవత్సరాలుగా నేను రాహుల్ (Rahul Vijay) తోనే వర్క్ చేశానని ఏ మాత్రం ఈగో లేని వ్యక్తి అని, ఆయ‌న‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం చాలా హ్యాపీగా ఉంద‌ని భ‌విష్య‌త్తులోను ఆయ‌న‌తో సినిమాలు చేస్తాన‌ని రాజ‌శేఖ‌ర్ (Shivani Rajashekar) తెలిపింది.

Updated Date - May 16 , 2024 | 12:40 PM