మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandu Death: చందు మరణంపై భార్య శిల్ప స్పందన!

ABN, Publish Date - May 18 , 2024 | 02:43 PM

బుల్లితెర నటుడు చందు (Chandu) ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప (Shilpa) స్పందించారు. ఐదు సంవత్సరాలుగా పవిత్రతో (pavitra)చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె మీడియా ముందు చెప్పారు.

బుల్లితెర నటుడు చందు (Chandu) ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప (Shilpa) స్పందించారు. ఐదు సంవత్సరాలుగా పవిత్రతో (pavitra)చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె మీడియా ముందు చెప్పారు. 'త్రినయిని' (Trinayani)సీరియల్‌ వచ్చినప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందన్నారు. చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె వివరించారు. గత ఐదు సంవత్సరాలుగా పవిత్ర మాయలో పడి తమను పట్టించుకోవడం మానేశాడని, ఇంటికి కూడా రావడం లేదని బాధను వ్యక్తం చేశారు. (Chandu suicide)


ఇంకా ఆమె మాట్లాడుతూ "వివాహం జరిగిన తర్వాత వివాహేతర సంబంధం మూలంగా జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రస్తుతం మా పరిస్థితి కూడా అలాగే ఉంది. పవిత్ర ఆకస్మిక మృతితో చందు ఒత్తిడికి గురయ్యాడు. ఇటీవల కత్తితో కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్‌స్టాలో మెసేజ్  కూడా పెట్టారు. శుక్రవారం ఆయన ఫోన్‌ ఎత్తకపోయేసరికి అనుమానంతో తెలిసిన వాళ్లను అక్కడికి పంపాము. అప్పటికే ఆయన ఫ్యానుకి  ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు’ శిల్ప చెప్పారు. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని శిల్ప వేడుకున్నారు. 

Updated Date - May 18 , 2024 | 03:09 PM