40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shakeela: షకీలాపై పెంచిన కూతురు దాడి!

ABN, Publish Date - Jan 21 , 2024 | 08:03 PM

నటి షకీలాపై (Shakeela) తన పెంపుడు కుమార్తె శీతల్‌ దాడి చేసింది. ఈ మేరకు షకీలా పోలీస్ లకు  ఫిర్యాదు చేసింది. ఇంతకీ శీతల్‌.. ఎవరో కాదు.. షకీలా అన్న కుమార్తే. కుటుంబ వ్యవహారాల విషయంలో మనస్పర్థలు తలెత్తడంతో శీతల్‌ (Sheetal) శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది

నటి షకీలాపై (Shakeela) తన పెంపుడు కుమార్తె శీతల్‌ దాడి చేసింది. ఈ మేరకు షకీలా పోలీస్ లకు  ఫిర్యాదు చేసింది. ఇంతకీ శీతల్‌.. ఎవరో కాదు.. షకీలా అన్న కుమార్తే. కుటుంబ వ్యవహారాల విషయంలో మనస్పర్థలు తలెత్తడంతో శీతల్‌ (Sheetal) శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుందాం అని రమ్మని పిలిేస్త తన తల్లిని వెంటపెట్టుకుని వచ్చిందని.. నచ్చ జెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆగ్రహంతో దాడికి పాల్పడిందని షకీలా ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఘర్షణ జరిగిన సమయంలో అక్కడే ఉన్న మహిళా న్యాయవాదితో శీతల్‌ తల్లి విచక్షణారహితంగా ప్రవర్తించిందని తెలిపింది. అదే పోలీస్‌ ేస్టషన్‌లో షకీలాపై శీతల్‌ కూడా ఫిర్యాదు చేసింది. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Updated Date - Jan 21 , 2024 | 08:03 PM