Seetha Kalyana Vaibhogame: సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసిన‌.. ‘సీతా కళ్యాణ వైభోగమే’ యూనిట్‌

ABN, Publish Date - Jun 17 , 2024 | 06:42 PM

సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వదిలిన పాటలు, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం జూన్ 21న భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతోంది.

SeethaKalyanaVaibhogame

సుమన్ తేజ్ (Suman Tej), గరీమ చౌహన్ (Garima) హీరో హీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’ (Seetha Kalyana Vaibhogame). డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాచాల యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వదిలిన పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం జూన్ 21న భారీ ఎత్తున విడుదలకు సిద్దం అవుతోంది.

ఈ క్రమంలో చిత్ర యూనిట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసి చిత్ర టీజర్, ట్రైలర్‌ను చూపించారు. సీతా కళ్యాణ వైభోగమే (Seetha Kalyana Vaibhogame) ట్రైలర్‌ను వీక్షించిన ముఖ్యమంత్రి చిత్రయూనిట్‌ను ప్రత్యేకంగా నిర్మాతను అభినందించారు. ట్రైలర్ మరియు పాటలు చాలా బాగున్నాయని సినిమా పెద్ద హిట్ అవ్వాలని, యూనిట్‌కు మంచి పేరు రావాలని అన్నారు. జూన్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ముఖ్యమంత్రిని కలిసిన వారిలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, నిర్మాత రాచాల యుగంధర్, డైరెక్టర్ సతీష్, నీరూస్ ప్రతినిధి అసీమ్, నటీనటులు సుమన్ తేజ్, గరీమ చౌహాన్, గగన్ విహారి కెమెరామెన్ పరశురామ్ తదితరులు ఉన్నారు. మన నేటివిటీని, మన ఆచార, సంప్రదాయాలు, మన సంస్కృతిని చాటేలా, మన ఇతిహాసగాథలైన రామాయణం నుంచి ప్రేరణపొంది ‘సీతా కళ్యాణ వైభోగమే’ (Seetha Kalyana Vaibhogame) అనే సినిమాను సతీష్ పరమవేద తెరకెక్కించారు.

Updated Date - Jun 17 , 2024 | 06:42 PM