Sayaji Shinde: పవన్‌జీ అపాయింట్‌మెంట్‌ ప్లీజ్‌.. నా ఆలోచన చెబుతా

ABN, Publish Date - Oct 07 , 2024 | 09:42 AM

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే, తన ఆలోచనని ఆయనతో పంచుకుంటానని నటుడు షాయాజీ షిండే అన్నారు.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) అపాయింట్‌మెంట్‌ ఇస్తే, తన ఆలోచనని ఆయనతో పంచుకుంటానని నటుడు షాయాజీ షిండే (Sayaji shinde) అన్నారు. దేవాలయాల్లో ప్రసాదంతోపాటు భక్తులకు ఒక మొక్కను ఇస్తే బాగుంటుందని, తాను ఇప్పటికే ఈ పని చేస్తున్నానని అన్నారు. తాజాగా ఆయన సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘మా నాన్న సూపర్‌హీరో’  చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా సుధీర్‌, షాయాజీ, ఆర్నా ‘బిగ్‌బాస్‌ సీజన్‌-8లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు షాయాజీ గురించి సుధీర్‌బాబు (Sudheer babu) మాట్లాడుతూ.. ఖాళీ ప్రదేశం కనపడితే చెట్లు నాటతారని హోస్ట్‌ నాగార్జునతో (Biggboss 8)అన్నారు. దీంతో ఆశ్చర్యపోయిన నాగార్జున మొక్కలు నాటడం వెనుక ఉన్న కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. (Maa Nanna Super Hero)


‘‘మా అమ్మగారు 97లో కన్ను మూశారు. ఆమె బతికి ఉన్నప్పుడు ఒక విషయం అడిగా ‘అమ్మా నా దగ్గర ఇంత డబ్బు ఉంది. కానీ, నేను నిన్ను బతికించుకోలేను. నేనేం చేయను’ అని బాధపడ్డాను. వెంటనే మరొక విషయం ఆమెకు చెప్పా. మా అమ్మగారి బరువుకు సమానమైన విత్తనాలను తీసుకుని, ఇండియా మొత్తం నాటుతానని అన్నాను. నేను నాటిన చెట్లు కొన్నాళ్లకు పెరిగి నీడను ఇస్తాయి. పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తుకు వస్తుంది. మా అమ్మ తర్వాత నాకు భూమాత కూడా అంతే గుర్తొస్తుంది. సాధారణంగా  దేవాలయాలకు వెళ్లినప్పుడు ప్రసాదాలు పంచుతారు. ప్రసాదంతోపాటు ఒక మొక్కను ఇేస్త బాగుంటుంది. దాన్ని భక్తులు తీసుకెళ్లి నాటితే అందులో భగవంతుడిని చూసుకోవచ్చు. మహారాష్ట్రలో మూడు దేవాలయ్యాల్లో నేను ఈ విధానం మొదలుపెట్టాను. అయితే, అందరికీ కాకుండా ఎవరైతే అభిషేకం చేస్తారో వారిలో సుమారు 100, 200 మందికి ప్రసాదంలాగా వీటిని ఇస్తారు.

Biggboss 8: వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ.. టీఆర్‌పీ కోసమేనా..

Updated Date - Oct 07 , 2024 | 04:54 PM