Satyanand Master: గ్రేట్ హీరోస్ అంతా నా స్టూడెంట్స్.. అందులో ‘వరుణ్’ చాలా ప్రత్యేకం
ABN, Publish Date - Nov 11 , 2024 | 11:16 AM
తాజాగా వైజాగ్‌లో జరిగిన మట్కా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సత్యానంద్ మాస్టర్ హీరో వరుణ్ తేజ్ గురించి తన స్టూడెంట్స్ అయిన ఇతర టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గాంఢీదధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ వంటి రెండు పరాజయాల తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) చటించిన చిత్నం 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్ మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా (Matka) ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. నవంబర్ 14న 'మట్కా' ప్రేక్షకులు ముందుకు రానున్న సందర్భంగా వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్యానంద్ మాస్టర్ (Satyanand Master) మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా అదృష్టం ఏంటంటే గ్రేట్ హీరోస్ అందరూ నా స్టూడెంట్స్. అందులో ప్రత్యేకమైన స్టూడెంట్ ఎవరంటే మా వరుణ్. వరుణ్ నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. నా దగ్గర నటన నేర్చుకునేటప్పుడు ఒక చిన్న పిల్లాడికి నేర్పిస్తున్న ఫీలింగ్ కలిగేది. చాలా కష్టపడి చాలా ఏకాగ్రతతో నేర్చుకున్నాడు. తను ఎంత పెద్ద యాక్టర్ అవుతాడనేది నాకు మాత్రమే తెలుసు. ముకుంద ఫంక్షన్‌లో ఆయన చాలా పెద్ద యాక్టర్ అవుతానని చెప్పాను. అప్పుడు చాలామంది ఏంటి ఇంత నమ్మకంగా చెప్తున్నారన్నారు.
తర్వాత ఆయన చేసిన కంచె, ఫిదా, గద్దల కొండ గణేష్.. ఇవన్నీ వరుసగా చూసుకుంటూ వస్తుంటే చాలా ఎదుగుదల కనిపించింది. వరుణ్ ఇంకా ఎదగాలని, ఎదుగుతారని నమ్ముతున్నా. కరుణ కుమార్ మట్కా చిత్రానికి వరుణ్‌ను ఎన్నుకోవడం నా అదృష్టం. ఇందులో సైకలాజికల్ గా చాలా పెర్ఫార్మన్స్ ఇవ్వాలి. ఆ క్యారెక్టర్ ని వరుణ్ చాలా అద్భుతంగా చేశాడని నమ్ముతున్నా. ఈ సందర్భంగా కరుణ్ కుమార్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. టీమ్ అందరికీ నా అభినందనలు. ఆల్ ది బెస్ట్ వరుణ్ పెద్ద హిట్ కొడతావు' అన్నారు.
డీఓపీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. హాయ్ వైజాగ్. వైజాగ్ కి రావడం ఇది రెండోసారి. సినిమా షూటింగ్ టైంలో ఫస్ట్ టైం వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. కరుణ్ కుమార్, ప్రొడ్యూసర్స్, హీరో వరుణ్ తేజ్ లకు థాంక్యూ సో మచ్'. ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కరుణ్ కుమార్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో 15 నుంచి 20 సెట్స్ వేయడం జరిగింది. అందులో వైజాగ్ 1962-70 మధ్య జరిగే టైం పీరియడ్ సంబంధించి పూర్ణ మార్కెట్ తో పాటు కూల్ క్లబ్ అనే మరో సెట్ ని చాలా గ్రాండ్ గా వేసాం. డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు డీటెయిల్ గా ఇన్ పుట్స్ ఇచ్చారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. హీరో, టెక్నీషియన్స్ అందరికీ థాంక్యు వెరీ మచ్' అన్నారు.