మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Maa Oori Polimera2: ఢిల్లీకి కొమరయ్య.. ‘మా ఊరి పొలిమేర 2’ అరుదైన ఘ‌న‌త‌

ABN, Publish Date - Apr 29 , 2024 | 05:23 PM

స‌త్యం రాజే ష్‌, డా. కామాక్షి భాస్కర్ల జంట‌గా నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. చేతబడుల‌ ఇతివృత్తంలో వ‌చ్చిన ఈ సినిమా ఓ అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకుంది.

polimera2

స‌త్యం రాజే ష్‌ (Satyam Rajesh), డా. కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla), గెట‌ప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య తదితరులు నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’(Ma Oori Polimera 2). శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి డా. అనిల్ విశ్వ‌నాథ్ (Anil Vishwanath) ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. గ‌త న‌వంబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం రూ.50 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

తాజాగా ఈ సినిమా.. మ‌న దేశంలో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ (Dada Saheb Phalke Film Festival)కు ఎంపికై అశ్చ‌ర్య ప‌రిచింది. త్వ‌ర‌లో ఢిల్లీలో ఈ సినిమాను మంగ‌ళ‌వారం (ఏప్రిల్ 30)న‌ కొద్ది మంది ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. అదే విధంగా మే నెలలో అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. గ్రామీణ ప్రాంతాల‌లో ఎక్కువ‌గా జ‌రిగే చేతబడి ఇతివృత్తంలో వ‌చ్చిన ఈ మా ఊరి పొలిమేర చిత్రాలు మొద‌టి పార్ట్ ఓటీటీలో విడుద‌లవ‌గా, రెండో భాగం థియేట‌ర్ల‌లో విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్‌గా నిలిచింది. జూన్‌లో ‘మా ఊరి పొలిమేర 3’(Ma Oori Polimera 3) షూటింగ్ ప‌ట్టాలెక్క‌నుంది.


ప్ర‌స్తుతం ‘మా ఊరి పొలిమేర 1’(Ma Oori Polimera 1) డిస్నీ ఫ్ల‌స్ హాట్ స్టార్‌లో , పార్ట్ 2 ఆహా ఓటీటీల్లో స్రీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. పొలిమేర 1లో చేతబడి సన్నివేశాలు, క్లైమాక్ష్స్‌లో అదిరిపోయే ట్విస్టుతో సినిమాను ముగించ‌గా , పార్ట్ 2కు వ‌చ్చేస‌రికి మొద‌టి భాగాన్ని మించిన స్టోరీతో, ట్విస్టుల‌తో సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే థ్రిల్లింగ్ స‌న్నివేశాల‌తో సినిమా అద్యంతం ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా అల‌రించింది.

Updated Date - Apr 29 , 2024 | 05:42 PM