Satyam Rajesh: నేను పిఠాపురం తాలుకానే.. ఆ వైబే వేరు

ABN, Publish Date - Nov 11 , 2024 | 10:57 AM

తాజాగా వైజాగ్‌లో జ‌రిగిన మ‌ట్కా మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో న‌టుడు స‌త్యం రాజేశ్ ఏపీ సీఎం ప‌వ‌ణ్‌ క‌ల్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడిన మాట‌లు నెట్టింట బాగా వైర‌ల్ అవుతున్నాయి.

sathyam rajesh

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా'. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్ మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా (Matka) ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'మట్కా' నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా యాక్టర్ నవీన్ చంద్ర (Naveen Chandra) మాట్లాడుతూ.. వైజాగ్ కి నాకు చాలా మంచి అనుబంధం ఉంది. గేమ్ ఛేంజర్ షూటింగ్ టైంలో మీరు చేసిన హడావిడి నా జీవితంలో మర్చిపోలేను. నేను చేసిన సినిమాలు, పాత్రలని ఆదరించినందుకు థాంక్యూ సో మచ్. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది వరుణ్ తేజ్ గారు, కరుణ కుమార్ గారు. వరుణ్ గారు గని సినిమాలో నాకు ఒక ముఖ్యమైన పాత్ర ఇచ్చారు. మట్కాలో ఈ పాత్రని బాగా చేస్తాని నమ్మి కరుణ కుమార్ అండ్ టీం ఈ అవకాశం ఇచ్చారు. ఈ పాత్రకు నేను న్యాయం చేశానని నమ్ముతున్నాను. నిర్మాతలకు టీమ్ అందరికీ థాంక్యు. మట్కా లో వరుణ్ తేజ్ మూడు డిఫరెంట్ లుక్స్ లో చాలా అద్భుతంగా పెర్ఫాం చేశారు. ఈ కథ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కరణ కుమార్ అద్భుతంగా తీశారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. నవంబర్ 14న ఈ సినిమాని మిస్ కావద్దు' అన్నారు.


యాక్టర్ జాన్ విజయ్ మాట్లాడుతూ.. నా వర్క్ ని అప్రిషియేట్ చేస్తున్న తెలుగు ఆడియన్స్ కి థాంక్యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కరుణ కుమార్ గారికి థాంక్యూ సో మచ్. డైరెక్టర్ గారు ఈ సినిమాలో నాకు చాలా న్యూ లుక్ ఇచ్చారు. నిర్మాతలకు థాంక్యూ. వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. చాలా అద్భుతమైన నటుడు. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్'అన్నారు. యాక్టర్ కార్తికేయ మాట్లాడుతూ.. ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కరుణ కుమార్ గారికి థాంక్యూ. ఈ సినిమాలో నాకు ఒక క్రేజీ సీన్ ఉంటుంది. వాసు క్యారెక్టర్ కి చిన్నప్పుడే అలాంటి సీన్ ఉంటే వరుణ్ అన్నకి ఇంకెలాంటి అద్భుతమైన సీన్స్ ఉంటాయో అనే ఎక్సైట్ మెంట్ ఉంది. ఈ సినిమా కోసం చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నాను. సినిమా తప్పకుండా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది' అన్నారు.

యాక్టర్ సత్యం రాజేష్ మాట్లాడుతూ.. వైజాగ్ ప్రజలందరికీ నమస్కారం. మట్కా ఆడియన్స్ ఊహించి దానికంటే చాలా బాగుంటుంది. యాక్షన్, ఫైట్స్ పక్కా వైజాగ్ మాస్. సినిమా అంతా గోల గోలగా ఉంటుంది. కరణ కుమార్ కి నాకు ఎప్పటినుంచో పరిచయం. నిర్మాతలు విజయేందర్ రెడ్డి గారికి , రామ్ తాళ్ళూరి గారి కంగ్రాజులేషన్స్. ఈ సినిమా సూపర్ హిట్ అయి నిర్మాతలకు బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా. వరుణ్ తేజ్ గారిని కలిసినప్పుడు నాకెందుకో పవన్ కళ్యాణ్ గారిని కలిసినట్టే ఉంటుంది. మట్కా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఆడియన్స్ అందరూ చూసి సూపర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్' అన్నారు. యాక్టర్ అవినాష్ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కరుణ కుమార్ గారికి, నిర్మాతలకు థాంక్యూ సో మచ్. వరుణ్ అన్న దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. మూవీ నవంబర్ 14 రిలీజ్ అవుతుంది అంతా థియేటర్స్ కి వెళ్లి వాచ్ చేయండి. థాంక్యూ సో మచ్' అన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 10:57 AM