Sankranti: ఈ సంక్రాంతికి హాలిడేస్ అదుర్స్.. సినిమాల సందడే సందడి

ABN, Publish Date - Oct 19 , 2024 | 10:14 AM

ఈ సంక్రాంతికి పండగ హాలిడేస్ కాకుండా మరిన్ని హాలిడేస్ అదనంగా యాడ్ అయ్యాయి. దీంతో సినీ నిర్మాతలతో పాటు ప్రేక్షకులు ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకీ ఏంటి ఆ హాలిడేస్.. సినిమాలకి ఎలా కలిసి వస్తుందంటే..

సంక్రాంతి పండగ తెలుగు ప్రజలకు ఎంత ప్రత్యేకమైనదో.. సినీ అభిమానులు కూడా అంతే ప్రత్యేకం. తరతరాలుగా సంక్రాంతి పండగకి ఫ్యామిలీతో కలిసి సినిమాలకి వెళ్లడం అనేది ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ప్రోత్సహిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా బడా హీరోల సినిమాలు దింపి భారీ కాసులు సంపాందించుకుంటుంది. అయితే ఈ సంక్రాంతికి పండగ హాలిడేస్ కాకుండా మరిన్ని హాలిడేస్ అదనంగా యాడ్ అయ్యాయి. దీంతో సినీ నిర్మాతలతో పాటు ప్రేక్షకులు ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకీ ఏంటి ఆ హాలిడేస్.. సినిమాలకి ఎలా కలిసి వస్తుందంటే..


ఈ సారి సంక్రాంతి సోమవారం రానుంది. దీంతో సంక్రాంతి, భోగి, కనుమ హాలిడేస్ ముందే శని, ఆదివారాలు సెలవులు అదనంగా లభించనున్నాయి. పిల్లలకు ఎలాగో సంక్రాంతి హాలిడేస్ కలిసొస్తాయి. ఇంకా ఒకటి లేదా రెండు రోజులు లీవ్ పెట్టె జనాలు కూడా ఎక్కువే.. దీంతో ఈ సంక్రాంతి ఫిల్మ్ మేకర్స్‌తో పాటు ప్రేక్షకులకి ఎంతో కలిసొచ్చింది. గత సంక్రాంతిలతో పోల్చుకుంటే ఈ సారి పోటీ కాస్త తక్కువగానే కనిపిస్తుంది. అయితే మెగా స్టార్ 'విశ్వంభర'ని కాదని రంగంలోకి దిగుతున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పైన నిర్మాతలతో పాటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరో వైపు వెంకీ- అనిల్ రావిపూడి, బాలయ్య 109వ చిత్రాలు కూడా సంక్రాంతి బరిలో ఉండగా ఆ సినిమాలకి ఇంకా టైటిల్స్ ఖరారు చేయకపోవడం కొసమెరుపు.


ఇక వెంకటేష్ సినిమా కాన్సెఫ్ట్ విషయానికి వస్తే.. హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్స్‌లెంట్ వైఫ్.. ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎక్స్‌ట్రార్డినరీ ట్రైయాంగిల్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh)లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఇన్-ఫార్మ్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్, తమ్మిరాజు ఎడిటింగ్.. ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ కో -రైటర్స్, వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Updated Date - Oct 19 , 2024 | 10:15 AM