Sandhya Theatre Stampede: అల్లు అర్జున్‌కి సినిమా చూపిస్తున్న పోలీసులు

ABN, Publish Date - Dec 24 , 2024 | 02:35 PM

సంధ్య థియేటర్ ఘటనలో A 11గా నిలిచిన సినీ నటుడు అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఆయన మరోసారి సంధ్య థియేటర్‌కి తీసుకెళ్లనున్నారు.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. చిక్కడపల్లి ఏసీపీ రమేశ్‌ సీఐ రాజు బన్నీని ప్రశ్నించారు. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ నేతృత్వంలో విచారణ జరిగింది. అనంతరం బన్నీని సంధ్య థియేటర్ కి తీసుకెళ్లనున్నారు. ఎందుకంటే


అల్లు అర్జున్ ఇవాళ మరోసారి సంధ్య థియేటర్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి మాత్రం ఆయన వెళ్లేది సినిమా చూడటానికి కాదు. సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం అవసరమైతే పోలీసులు అల్లు అర్జున్‌ను సంధ్య థియేటర్ వద్దకు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోమవారం బన్నికి ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. దాదాపు పది అంశాలపై పోలీసులు అల్లు అర్జున్‌ను ప్రశ్నించనున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ తనకు సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిందనే విషయాన్ని ఎవరూ తన దృష్టికి తీసుకురాలేదని, తరువాత రోజు మాత్రమే విషయం తెలిసిందన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అల్లు అర్జున్‌కు ఎసీపీ సమాచారం ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహారించారని శాసనసభ వేదికగా వెల్లడించారు. దీంతో మీడియా సమావేశంలో అల్లు అర్జున్ ఆరోపణలపైనా ఇవాళ విచారించే అవకాశం ఉంది.


ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తన న్యాయవాదులతో కలిసి అల్లు అర్జున్ బయలుదేరారు. విచారణలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్‌ను తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Dec 24 , 2024 | 02:46 PM