Sandeep Reddy Vanga: ప్రభాస్ 24 సినిమాలు వేరు... ఈ సినిమా వేరు!
ABN, Publish Date - Apr 09 , 2024 | 04:51 PM
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit)తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం కానప్పటికీ భారీ అంచనాలే నెలకొన్నాయి.
ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit)తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం కానప్పటికీ భారీ అంచనాలే నెలకొన్నాయి. 'యానిమల్' (Animal)చిత్రం సక్సెస్‌ని ఆస్వాదిస్తున్న దర్శకుడు సందీప్‌రెడ్డి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘300 కోట్ల బడ్జెట్‌తో ‘స్పిరిట్’ను తెరకెక్కిస్తున్నాం. శాటిలైట్, డిజిటల్ హక్కుల విక్రయంతోనే ఈజీగా ఆ బడ్జెట్ వచ్చేస్తుంది. విడుదలయ్యాక తొలిరోజే రూ.150 కోట్లు కచ్చితంగా వస్తాయి. ఇది నమ్మకం కాదు.. వ్యాపారం. ఏ సినిమా అయినా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోగలిగితే.. దానికి మొదటిరోజే మంచి వసూళ్లు వస్తాయి. ‘స్పిరిట్’లో ప్రభాస్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తారు. ఇప్పటి వరకు ప్రభాస్‌ను గత 24 సినిమాల్లో ప్రేక్షకులు ఒకలా చూశారు. ఇప్పుడు మరోస్థాయిలో చూస్తారు. ఆయనలో చాలా ప్రత్యేకతలున్నాయి. ఆయన వెనక్కి తిరిగి చూసే స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నేను ఆయన్ని చూపించే విధానం ఆడియన్స్ కు నచ్చితే చాలు.. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుంది.’’ అని అన్నారు. ‘బేబీ’, ‘ఉప్పెన’ కథలు మీ దగ్గరకు వస్తే దేనికి దర్శకత్వం వహిస్తారనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ‘‘నేను నిర్మాతగా సినిమా తీయాలని కొన్ని కథలు విన్నాను. అవేమీ నచ్చలేదు. కథ నచ్చితే డైరెక్ట్ చేయడంతోపాటు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తా. ‘ఉప్పెన’ చిత్రం చాలా బాగుంటుంది. ఆ ఐడియా నాకు నచ్చింది. భవిష్యత్తులో బయోపిక్ చేయాల్సి వస్తే.. మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తా’’ అని అన్నారు.