మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Samantha: మనసుకు తగిలిన గాయం నుంచి కోలుకోవాలంటే..!

ABN, Publish Date - Mar 08 , 2024 | 02:08 PM

కథానాయికగా ఎంత బిజీగా ఉన్నా సమంత మాత్రం అభిమానులకు సోషల్‌ మీడియా వేదికగా అందుబాటులోనే ఉంటారు. సమయం కుదిరిన ప్రతిసారీ అభిమానులతో సంభాషిస్తుంటారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చారు.

కథానాయికగా ఎంత బిజీగా ఉన్నా సమంత (Samantha) మాత్రం అభిమానులకు సోషల్‌ మీడియా వేదికగా అందుబాటులోనే ఉంటారు. సమయం కుదిరిన ప్రతిసారీ అభిమానులతో సంభాషిస్తుంటారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా (Social media interaction) ఉంటున్నారు. ఇటీవల ఓ జలపాతంలో బికినీతో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ మరో ఆసక్తికర  ఫొటో షూట్‌తో ఆకట్టుకుంది. ఆ ఫొటోలు ఇన్ స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్‌ చేస్తున్నారు.



‘మనపై మనకున్న ఆత్మవిశ్వాసం గొప్ప వ్యక్తిగా ఎదగడానికి సాయపడుతుంది. నేను అభద్రతాభావానికి లోనవుతున్నానని కొన్ని రోజుల క్రితం గ్రహించాను. త్వరగా దాని నుంచి బయటకు వచ్చాను. బయట గాయాల కంటే మనసుకు తగిలిన గాయం నుంచి కోలుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుంది’ అని ఇటీవల  మ్యాగజైనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. అయితే ఆ మ్యాగజైన్‌ కవర్‌ఫొటోపై సమంత లుక్స్‌ చూసి అభిమానులే కాదు సినీ తారలు  కామెంట్లు పెడుతున్నారు. ‘గ్లామర్‌గా ఉన్నావు’ అని ఒకరు అనగా.. ‘నిజంగా సమంతనేనా.. ఏఐ క్రియేషన్ లా  ఉంది’ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు. మాకు పాత సమంతనే కావాలంటూ’ పలువురు కోరుతున్నారు. హీరోయిన శ్రియా శరణ్‌ కూడా సమంత లుక్‌కి స్టన్ అయ్యారు. 'హల్లో గార్జియస్‌ సమంత’ అంటూ కామెంట్‌ చేయగా సామ్‌ ఆ ఫొటోను ఇన్ స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. ఇలాంటి కామెంట్స్‌ మరెన్నో వచ్చాయి.



గతేడాది ‘శాకుంతలం’, ‘ఖుషి’ చిత్రాలతో అలరించిన సమంత కొత్త చిత్రాల ప్రకటన ఏమీ చేయలేదు.  ఆమె నటించిన వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’ విడుదలకు సిద్థమవుతోంది.  ఇందులో సమంత- వరుణ్‌ ధావన నటించారు. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు. ఇటీవల సమంత  ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’ అనే నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. 

Updated Date - Mar 08 , 2024 | 02:36 PM